AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 55 ఏళ్లుగా విడదీయలేని స్నేహబంధం.. ఐఏఎస్‌ అధికారిని పోస్ట్‌ వైరల్

రెండు ఏనుగులకు సంబంధించిన ఒక కథ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. గత 55 సంవత్సరాలుగా కలిసి ఉన్న ఆ రెండు ఏనుగులు చిరకాల మిత్రులు. అవును ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన సోషల్ మీడియా పేజీలో 55 సంవత్సరాలుగా విడదీయరాని స్నేహంతో కలిసి మెలిసి ఉంటున్న రెండు ఏనుగుల గురించిన సమాచారాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు.

Viral Video: 55 ఏళ్లుగా విడదీయలేని స్నేహబంధం.. ఐఏఎస్‌ అధికారిని పోస్ట్‌ వైరల్
ఏనుగు శాఖాహారా లేక మాంసాహారా అనే సందేహం చాలా మందికి ఉండవచ్చు. కొంతమందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉండవచ్చు. కానీ చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు.
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2025 | 7:20 PM

Share

రెండు ఏనుగులకు సంబంధించిన ఒక కథ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. గత 55 సంవత్సరాలుగా కలిసి ఉన్న ఆ రెండు ఏనుగులు చిరకాల మిత్రులు. అవును ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన సోషల్ మీడియా పేజీలో 55 సంవత్సరాలుగా విడదీయరాని స్నేహంతో కలిసి మెలిసి ఉంటున్న రెండు ఏనుగుల గురించిన సమాచారాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. వాటిలో ఒకదాని పేరు బామా. మరొకదాని పేరు కామచ్చి. అవి నీలగిరి జిల్లాలోని ముదుమలైలోని తెప్పకడు ఏనుగుల అభయారణ్యంలో నివసిస్తున్నాయి.

బామా ఏనుగు వయసు 75 సంవత్సరాలు, కామాచ్చి ఏనుగు వయసు 65 సంవత్సరాలు. అయితే, కేవలం మనుషుల మధ్య మాత్రమే ప్రేమ, స్నేహాం వంటి భావోద్వేగాలు ఉండవు..జంతువులు మధ్య కూడా అలాంటి బంధాలు ఉంటాయని ఈ రెండు ఏనుగులు నిరూపిస్తున్నాయి. ఈ రెండు పెద్ద ఏనుగుల మధ్య స్నేహా కూడా అంతటి గొప్పది అంటూ ఆ అధికారిని ఒక వీడియోను షేర్ చేశారు. అందులో రెండు ఏనుగులు పక్కపక్కనే నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

బామా, కామాక్షి చాలా సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నారు. వారు ప్రతిదీ కలిసి చేస్తారు. తినడం, విశ్రాంతి తీసుకోవడం లేదా నడవడం అయినా. వారికి చెరకు కావాలనుకున్నా, వారిద్దరూ కలిసి వచ్చి దానిని అడుగుతారు. వాటి విషయానికొస్తే వాటికి స్నేహమే సర్వస్వం అని సాహు తన పోస్ట్‌లో రాశారు. చాలా మంది మనుషులు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తమ స్నేహితులను మరచిపోతుండగా, రెండు ఏనుగులు 55 సంవత్సరాలకు పైగా జీవితాంతం స్నేహితులుగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నెటిజన్ల స్పందన:

సాహు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన కొంతమంది ఈ ఏనుగులను స్వయంగా చూసి ఉంటే బాగుండునని కోరుకుంటున్నట్లు వ్యక్తం చేశారు. అలాగే, కొంతమంది ఈ వీడియోలో తమ స్నేహితులను ట్యాగ్ చేస్తూ, మనం కూడా చివరి వరకు స్నేహితులుగా ఉండాలి అని చెబుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఏనుగులకు మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఒక ప్రదేశం నుండి నీరు వస్తే, ఎన్ని సంవత్సరాలు గడిచినా అవి ఆ ప్రదేశాన్ని ఎప్పటికీ మర్చిపోవు. అదేవిధంగా, అవి ప్రజల ముఖాలను, గొంతులను, వాటి స్వంత జాతిని గుర్తుంచుకోగలవు. వారికి ఎవరు స్నేహితుడు, ఎవరు శత్రువు అని కూడా తెలుసు అంటూ చాలా మంది నెటిజన్లు స్పందించారు.

ఏనుగులు GPS పరికరాల లాగా మార్గాలను ఖచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి 1000 కి.మీ దూరం వరకు ఉన్న మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలవు. ఏనుగులు 200 కి.మీ దూరం నుండి కూడా వాసన చూడగలవు. అదేవిధంగా, మనుషుల మాదిరిగానే, ఎవరైనా చనిపోయినప్పుడు విచారంగా భావించే లక్షణం వాటికి కూడా ఉంటుందని పలువురు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..