Viral Video: వార్నీ ఇదెక్కడి విడ్డూరంరా సామీ.. రైలు పట్టాలకు పెళ్లి చేసిన ఘనులు.. వీడియో చూస్తే అవాక్కే..!
వైరల్ వీడియోలో జరిగింది చూస్తే ఔరా ఈ ప్రపంచం ఎటు వెళుతోందంటూ ముక్కున వేలేసుకుంటారు..ఆశ్చర్యంతో కండ్లు తేలేస్తారు. మన దేశంలో కొంతమంది మూఢనమ్మకాల కారణంగా చాలా విషయాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ మూఢనమ్మకాలతో కొందరు చేస్తున్న పనులు ఇంటర్‌నెట్ వేదికగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Railway Tracks Wedding: గత కొన్ని నెలలుగా భారతదేశంలో అనేక వింతలు జరుగుతున్నాయి. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా నిజమనే అంటారు. ఇక్కడ జరిగింది చూస్తే ఔరా ఈ ప్రపంచం ఎటు వెళుతోందంటూ ముక్కున వేలేసుకుంటారు..ఆశ్చర్యంతో కండ్లు తేలేస్తారు. మన దేశంలో కొంతమంది మూఢనమ్మకాల కారణంగా చాలా విషయాలను గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ మూఢనమ్మకాలతో కొందరు చేస్తున్న పనులు ఇంటర్‌నెట్ వేదికగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై చాలా మంది నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పెరుగుతున్న రైలు ప్రమాదాలు..
గత 2 సంవత్సరాలలో భారతదేశంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా 2023లో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం, గత సంవత్సరం జరిగిన గూడ్స్ వ్యాగన్ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల, తిరువళ్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని అగ్నిప్రమాదం సంభవించి 5 వ్యాగన్లు కాలిపోయాయి. దీని కారణంగా ప్రజల ప్రయాణం నిలిచిపోయింది. అటువంటి రైలు ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి కొందరు వ్యక్తులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పెళ్లి జరిపిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి, పసుపు, నిమ్మకాయలు కోసివేస్తున్నారు. రెండు పట్టాలను భార్యాభర్తలుగా భావించి ఈ విధంగా వివాహం చేస్తున్న సంఘటనపై ప్రజల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ సంఘటన ఉత్తర భారతదేశంలో జరిగిందా లేదా దక్షిణ భారతదేశంలో జరిగిందా, ఏ పట్టణంలో జరిగింది..? ఏ రైల్వే పట్టాపై జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి…
தண்டவாளங்களுக்கு திருமணம் செய்து வைத்தால் விபத்து நடக்காதாம்! 🤦🏻♂️
The superstious! pic.twitter.com/PLsHuVQg6C
— பகுத்தறிவாளன் (@DRAVIDA_WARRIOR) July 13, 2025
నెటిజన్ల అభిప్రాయాలు..
రైల్వే ట్రాక్‌లపై పెళ్లి జరిపిస్తున్న ఈ వీడియో వైరల్ కావడంతో , చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పోస్ట్ చేస్తున్నారు. ఈ పట్టాలు విడాకులు తీసుకుంటే ఏం చేస్తారు? అని కూడా అడుగుతున్నారు. ఒక వ్యక్తి, “మీకు శాస్త్రీయ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు అస్సలు జ్ఞానం లేకపోతే ఏం చేయాలి?” అని అడిగారు. దేశంలో సమస్యలను పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉన్నప్పుడు, ప్రజలు ఇలాంటివి ఎందుకు చేస్తారంటూ చాలా మంది చిరాకు పడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




