AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు రాలుతుందా.. మెరిసే పట్టులాంటి, పాము జడ కావాలంటే అరటిపండు హెయిర్ ప్యాక్ ట్రై చేయండి..!

అరటి పండులోని నూనెలు జుట్టును లోతుగా తేమగా ఉండేలా చేస్తాయి. దీంతో వాతావరణ మార్పుల వల్ల మీ జుట్టు పాడవకుండా రక్షణ పొందుతుంది. అరటి పండులోని పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అరటి పండు హెయిర్‌ ప్యాక్‌ మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అరటి పండులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. మరిన్ని లాభాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం...

జుట్టు రాలుతుందా.. మెరిసే పట్టులాంటి, పాము జడ కావాలంటే అరటిపండు హెయిర్ ప్యాక్ ట్రై చేయండి..!
Banana Hair Mask
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2025 | 5:48 PM

Share

జుట్టు పొడవుగా, మందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక ఇంటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు. అయితే, మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే అరటిపండును జుట్టుకు అప్లై చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అరటిపండును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాదు.. చుండ్రు సమస్య నుండి తప్పించుకోవడానికి కూడా జుట్టుకు అరటిపండు హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

అరటి పండు హెయిర్‌ ప్యాక్‌ జుట్టు మూలాలకు తేమను పంపడానికి పనిచేస్తుంది. చిక్కుబడ్డ జుట్టును మృదువుగా చేయడానికి కూడా మీరు అరటిపండు హెయిర్ మాస్క్‌ను అప్లై చేయొచ్చు. అరటి హెయిర్ మాస్క్ ఎందుకు మంచిది? అరటి పండులోని నూనెలు జుట్టును లోతుగా తేమగా ఉండేలా చేస్తాయి. దీంతో వాతావరణ మార్పుల వల్ల మీ జుట్టు పాడవకుండా రక్షణ పొందుతుంది. అరటి పండులోని పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అరటి పండు హెయిర్‌ ప్యాక్‌ మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అరటి పండులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి.

అరటి పండు హెయిర్ మాస్క్ తయారీ కోసం కావలసినవి బాగా పండిన అరటి పండు ఒకటి తీసుకోవాలి. పెరుగు 2 నుంచి3 స్పూన్లు తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్‌ తేనెను యాడ్‌ చేసుకోవాలి. అలాగే, ఒక స్పూన్‌ కొబ్బరి నూనె, పావు భాగం అవకాడో మిశ్రమాన్ని కలుపుకోవాలి. మెత్తటి అరటి పండును తొక్క తీసి, ఫోర్క్‌తో లేదా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇందులోనే పెరుగు, తేనె, కొబ్బరి నూనె లేదా అవకాడోను కలిపి మృదువైన పేస్ట్‌లా చేసుకోవాలి. చిక్కటి మిశ్రమం తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మీ తలకు, జుట్టుకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. తరువాత తలను వేడి టవల్‌తో కవర్‌ చేసుకోవాలి. సుమారు అరగంట తరువాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.