AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

September Tour: సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ బీచ్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్..

ఈ యేడు సెప్టెంబర్ నెలలో చాలా సెలవులు వస్తున్నాయి. ఆగస్టు వినాయక చవితి మొదలుకొని సెప్టెంబర్‌లో నిమజ్జనం వరకు ఎన్నోపండుగలొచ్చాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తూ నిరంతర ఒత్తిడితో ఉన్నవారంతా కొన్ని రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా లాంగ్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారు భారతదేశంలోని ఈ 7 బీచ్‌లను సందర్శించవచ్చు. వర్షాకాలం తర్వాత ఇవి మీకు కొత్త అనుభవాన్ని పంచుతాయి.

September Tour: సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఈ బీచ్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్..
September Tour
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2025 | 6:12 PM

Share

ఈ యేడు సెప్టెంబర్ నెలలో చాలా సెలవులు వస్తున్నాయి. ఆగస్టు వినాయక చవితి మొదలుకొని సెప్టెంబర్‌లో నిమజ్జనం వరకు ఎన్నోపండుగలొచ్చాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తూ నిరంతర ఒత్తిడితో ఉన్నవారంతా కొన్ని రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా లాంగ్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారు భారతదేశంలోని ఈ 7 బీచ్‌లను సందర్శించవచ్చు. వర్షాకాలం తర్వాత ఇవి మీకు కొత్త అనుభవాన్ని పంచుతాయి.

బాగా బీచ్: గోవాలో సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో రద్దీ తక్కువగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జల క్రీడలకు ఇది మంచి సమయం. రాత్రిపూట ఇక్కడ పార్టీలు చేసుకోవడం వల్ల మీకు వేరే స్థాయి అనుభవం లభిస్తుంది.

తిహా బీచ్: సెప్టెంబర్‌లో ఇక్కడ అలలు ప్రశాంతంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఈ బీచ్ మీ బడ్జెట్‌లోనే ఉంటుంది. కుటుంబంతో కలిసి వెళ్లడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ లభించే వేయించిన చేపలు, పలు రకాల సీ ఫుడ్‌ మీరు అద్భుతమైన రుచిని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

గోకర్ణ ఓం బీచ్: కర్ణాటకలోని ఈ బీచ్ వర్షాకాలం తర్వాత అత్యుత్తమంగా ఉంటుంది. సెప్టెంబర్‌లో పర్యాటకులు సందర్శించడానికి ఇది సరైన ప్రదేశం. మీరు తీరప్రాంతాల్లోని పర్వతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కావాల్సిన మంచి రుచికరమైన భోజనం చేయవచ్చు. యోగా చేయవచ్చు, ఇవన్నీ మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి.

వర్కాల: కేరళలోని ఈ బీచ్ వర్షాకాలం తర్వాత నూతనోత్సాహంతో కనిపిస్తుంది. సెప్టెంబర్ నెల ఇక్కడ యోగా, ఆయుర్వేద మసాజ్‌లు చేయించుకోవడానికి బెస్ట్‌ టైమ్‌ అంటున్నారు. సో మీరు కూడా టైమ్ ఉంటే ఈ సెప్టెంబర్‌లో కేరళ టూర్‌ ప్లాన్‌ చేసుకోండి.

దర్గర్లి బీచ్: మహారాష్ట్రలోని ఈ బీచ్ సెప్టెంబర్‌లో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇక్కడ స్కూబా డైవింగ్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

కోవలం బీచ్: ఇది కేరళలోని ఒక స్వర్గధామం. వర్షాకాలం తర్వాత ఈ బీచ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

పూరి బీచ్: ఒడిశాలోని ఈ బీచ్ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జనసమూహం తక్కువగా ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం అందంగా ఉంటుంది. మీరు పూరి జగన్నాథ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..