అర్థరాత్రి ఓ జంటను చూసి దోచుకెళ్లేందుకు యత్నించిన దుండగులు.. చివరికి వారికే డబ్బులు ఇచ్చేశారు..
ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులను వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో కూడా భయపెడతారు. ఇక చేసేదేమి లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ మధ్య రోడ్డు మీద ఎవరైన ఒంటరిగా కనిపిస్తే చాలు.. దుండగులను వారిని బెదిరించి వాళ్ల వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని దోచుకెళ్తున్నారు. ఇవ్వకపోతే కత్తులు, తుపాకులతో కూడా భయపెడతారు. ఇక చేసేదేమి లేక బాధితులు వారు అడిగినవి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీలో మాత్రం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి పూట నడిరోడ్డుపై వెళ్తున్న ఓ జంటను చూసి ఇద్దరు దుండగులు వాళ్ల దగ్గర ఉన్నవి దోచుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల పరిస్థితిని చూసి వాళ్లిద్దరికి తిరిగి 100 రూపాయలు ఇచ్చి వెళ్లిపోయారు.
వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో తాజాగా ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట ఓ జంటను చూసి తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్నవి ఇచ్చేయాలని లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. వాళ్ల జేబులు చెక్ చేశారు. కానీ వారి దగ్గర ఆ దుండగులకు కేవలం రూ.20 మాత్రమే దొరికాయి. అలాగే ఆ మహిళ ఒంటిపై ఉన్న ఆభణాలు కూడా చూశారు. కానీ అవి కూడా రోల్డ్ గోల్డని తెలుసుకున్నారు. ఇక ఆ జంట నుంచి ఏమి తీసుకెళ్లలేమని భావించి.. వారికే రూ.100 ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిద్దరు కూడా ఒకరు ప్రైవేటు, మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా వారిని అరెస్టు చేసి నుంచి తుపాకి, బైక్, 30 వేలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




