AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: దారితప్పి బావిలో పడ్డ చిరుత.. ఎలా బయటకు తీశారో మీరే చూడండి

ఈ మధ్య చిరుతలు కూడా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వీటివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే కర్ణాటకలో అడవిలో నుంచి వచ్చిన చిరుత జనాలు ఉండే చోటుకు వచ్చింది. అలా వస్తూనే దారి తప్పిపోయి ఓ బావిలో పడిపోయింది.

Watch Video: దారితప్పి బావిలో పడ్డ చిరుత.. ఎలా బయటకు తీశారో మీరే చూడండి
Leopard
Aravind B
|

Updated on: Jun 26, 2023 | 4:25 AM

Share

ఈ మధ్య చిరుతలు కూడా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వీటివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే కర్ణాటకలో అడవిలో నుంచి వచ్చిన చిరుత జనాలు ఉండే చోటుకు వచ్చింది. అలా వస్తూనే దారి తప్పిపోయి ఓ బావిలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు చాకచక్యంగా చిరుతను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే ఓ బావిలో చిరుత పులి పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ చిరుతను ఆ బావిలో నుంచి బయటకు పంపెలా ప్రయత్నించారు. ముందుగా ఆ బావిలో ఒక నిచ్చెన వేశారు.

కాని ఆ చిరత మాత్రం బావి దగ్గర ఉన్న మనుషులను చూసి భయపడింది. బయటకు రాకుండా బావి లోపలే దాక్కుంది. దీంతో అధికారులు మరో ఉపాయం చేశారు. స్థానికుల సహాయంతో ఓ పెద్ద కర్రకు నిప్పంటించారు. ఆ కర్రను ఆ బావిలో పెట్టి చిరుతను ఓ పక్క నుంచి బెదిరించారు. ఆ మంటను చూసి చిరుత భయపడిపోయింది. ఇక చేసేదేమి లేక నిచ్చెన సహాయంతో ఎలాగైన బయటకి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. వారు ఆ కర్రతో అలానే చిరుత వెళ్లిపోయేవరకు బెదిరించారు. చివరికి ఆ చిరుత నిచ్చెన ద్వారా బయటికి వచ్చి అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు దీనిపై తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..