AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అలెక్సాతో పిల్లాడి సంభాషణ…క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పిధా!

'పిల్లలు...దేవుడు చల్లని వారే...కల్ల కపటమెరుగని కరుణామయులే' అని ఓ సినీ కవి అన్నట్లు చిన్న పిల్లలు ఏ పని చేసినా....

Viral Video: అలెక్సాతో పిల్లాడి సంభాషణ...క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పిధా!
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2021 | 1:21 PM

‘పిల్లలు…దేవుడు చల్లని వారే…కల్ల కపటమెరుగని కరుణామయులే’ అని ఓ సినీ కవి అన్నట్లు చిన్న పిల్లలు ఏ పని చేసినా చూడముచ్చటగా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తుంటే వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక అమెజాన్‌ వర్చువల్ అసిస్టెంట్‌ సాధనమైన ‘అలెక్సా’ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అడిగిన వెంటనే నచ్చిన పాటను ప్లే చేయడం, తాజా వార్తలు వినిపించడం… ఒకటేమిటి? దాదాపు మనుషులు చేసే అన్ని పనులు ఈ వర్చువల్‌ సాధనం చేస్తుంది. ఈ నేపథ్యంలో కబీర్ సూద్‌ అనే ఓ పిల్లాడు, అలెక్సాల మధ్య సాగిన సరదా సంభాషణ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆ చిన్నారి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

ముద్దు ముద్దు మాటలతో…

వీడియోలో భాగంగా సోఫా పైకెక్కిన కబీర్‌ మొదట ఓ హిందీ పాటను ప్లే చేయమని అలెక్సాను ముద్దుముద్దుగా అడుగుతాడు కబీర్. స్పీకర్‌లో పాట వినిపించగానే సోఫా దిగి చిరునవ్వులు చిందిస్తాడు. కేరింతలు కొడతాడు. ఆ తర్వాత మరొక హిందీ పాటను అడుగుతాడు. కానీ ఈసారి ఆ పాటను అందుకోలేకపోతుంది అలెక్సా. అయినా వెనక్కు తగ్గకుండా మళ్లీ అదే పాటను అడుగుతాడు. ఇలా రెండు మూడుసార్లు అడిగిన తర్వాత కానీ తనకు నచ్చిన పాట వినిపించదు.. ఇలా అలెక్సాతో ఆ కబీర్‌ సాగించిన సంభాషణలను ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అతడి తల్లి. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కబీర్ అమాయకపు చూపులు, ముద్దు ముద్దు మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by Kabir Sood (@tintinkabacha)

Also Read..

Cat Viral Video: వామ్మో.. ఈ పిల్లి చేసిన పని చూస్తే.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

Viral Dance: కాళ్లకు చక్రాలు కట్టుకుని క్లాసికల్ డ్యాన్స్‌..సూపర్బ్‌ అంటోన్న నెటిజన్లు…