Viral Dance: కాళ్లకు చక్రాలు కట్టుకుని క్లాసికల్ డ్యాన్స్..సూపర్బ్ అంటోన్న నెటిజన్లు…
స్కేటింగ్‌కి ఎంతో సాధన అవసరం. ఇక నృత్యం చేయాలంటే ప్రతిభతో పాటు నైపుణ్యం కూడా తప్పనిసరి. ఈ రెండూ...
స్కేటింగ్‌కి ఎంతో సాధన అవసరం. ఇక నృత్యం చేయాలంటే ప్రతిభతో పాటు నైపుణ్యం కూడా తప్పనిసరి. ఈ రెండూ భిన్న విద్యలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తోంది రాజస్థాన్‌కు చెందిన కృష్ణా కన్వార్ గహ్లోత్. ప్రొఫెషనల్ స్కేటింగ్‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆమె తాజాగా ఓ కల్చరల్ ఈవెంట్‌లో పాల్గొంది. కార్యక్రమంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది. రాజస్థానీల సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి అతిథుల మన్ననలు అందుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కూడా యువతి డ్యాన్స్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
స్కేటింగ్ అండ్ డ్యాన్సింగ్… రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల ‘Odhani-2021’ పేరుతో ఇటీవల ఓ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించిన ఆర్గనైజర్ తాజాగా కల్చరల్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశాడు. ఇందులో కృష్ణా కన్వార్ డ్యాన్స్ వీడియో కూడా ఉంది. సంప్రదాయ లెహెంగా-చోలితో పాటు ఒంటినిండా ఆభరణాలు ధరించిన ఆమె… స్కేటింగ్..డ్యాన్సింగ్‌ను ఏకకాలంలో ప్రదర్శించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోన్న లైవ్ మ్యూజిక్‌కు అనుగుణంగా ఎంతో ఉత్సాహంగా కాలు కదిపింది. సాధారణంగా లెహెంగా ధరించినప్పుడు నడవడానికే ఇబ్బంది పడతారు. అలాంటిది ఈ అమ్మాయి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ లెహెంగాలో డ్యాన్స్ చేయడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘ఆమె డ్యాన్సింగ్ నైపుణ్యం అద్భుతం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also read: