Groom Viral Video: వరుడిని కొట్టి.. ఆర్ యూ ఓకే బేబీ అన్న వధువు.! వైరల్ అవుతున్న వీడియో..
పెళ్లయిన తరువాత వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. అయితే విదేశాల్లో అప్పుడే వివాహం జరిగిన ఓ జంటకు.. ఇరు కుంటుంబ సభ్యులు ఓ గేమ్‌ను నిర్వహించారు. ఆ ఆట కాస్త బెడిసికొట్టి, ఏకంగా వరుడు కిందపడి మరీ..
పెళ్లయిన తరువాత వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. అయితే విదేశాల్లో అప్పుడే వివాహం జరిగిన ఓ జంటకు.. ఇరు కుంటుంబ సభ్యులు ఓ గేమ్‌ను నిర్వహించారు. ఆ ఆట కాస్త బెడిసికొట్టి, ఏకంగా వరుడు కిందపడి మరీ.. తల్లడిల్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంగ్లాండ్‌లోని కార్లియాన్ బే హోటల్ గార్డెన్‌లో వధూవరులు రౌండర్స్ బాల్ ఆడారు. మొదటగా పెళ్లి కుమారుడు మ్యాట్ చెస్టర్‌ఫీల్డ్ బాల్ వేయగా, పెళ్లి కుమార్తె సారా చెస్టర్‌ఫీల్డ్ దాన్ని బ్యాట్‌తో కాస్త గట్టిగానే కొట్టింది. అది నేరుగా వెళ్లి వరుడి ప్రైవేటు భాగంలో తగిలింది. అంతే మనోడు కుప్పకూలి కిందపడి గిలగిల్లాడసాగాడు. ఈ సీన్ చూసి అక్కడి వాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. పాపం మ్యాట్‌కు దెబ్బ తగలిందన్న విషయం వధువుకి తెలియక.. నవ్వుకుంటూ, గెలుపుకోసం చుట్టూ పరిగెత్తింది. ఆ కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వరుడి దగ్గరకు వచ్చి.. ఆర్ యూ ఓకే బేబీ అంటూ ఓదార్చింది. కానీ అప్పటికే అతడి ముఖం బాధతో ఎర్రగా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

