Mars in Water (Knowthis): అంగారక గ్రహంపై మానవుడు జీవించాడు..? నాసా శాస్త్రవేత చెసిన షాకింగ్‌ కామెంట్స్‌.!(వీడియో)

అంగారక గ్రహం అంతరిక్ష ఔత్సాహికులను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. చాలా మంది ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలతో సహా ఈ అరుణ గ్రహం భూ గ్రహానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చెబుతారు. ఇక్కడ మానవుడు జీవించడానికి అనుకూలంగా ఉందని నమ్ముతారు.

Anil kumar poka

|

Oct 23, 2021 | 9:37 AM

అంగారక గ్రహం అంతరిక్ష ఔత్సాహికులను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. చాలా మంది ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలతో సహా ఈ అరుణ గ్రహం భూ గ్రహానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చెబుతారు. ఇక్కడ మానవుడు జీవించడానికి అనుకూలంగా ఉందని నమ్ముతారు. నాసా అగ్రశ్రేణి శాస్త్రవేత్త డాక్టర్ బెక్కీ మెక్కాలీ రెంచ్ ఒకప్పుడు అంగారకుడు భూమిలా కనిపించాడని వెల్లడించారు. అంతేకాదు.. అంగారక గ్రహంపై మానవుడి జీవంకు అనుకూలంగా ఉన్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రాచీన అంగారక గ్రహం మన గ్రహం వలె తడిగా, వెచ్చగా ఉండవచ్చని రెంచ్ సమాధానం ఇచ్చారు. ఈ గ్రహం రుతువులు, ధ్రువ మంచు పర్వతాలు, లోయలు, వాతావరణాన్ని కూడా కలిగి ఉంది. అంగారకుడిపై అగ్నిపర్వతాలు, వరదలు వచ్చాయని చెప్పారు. నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు, అంగారకుడు, భూమి ఒకే పదార్థాలతో రూపొందించబడ్డాయని చెప్పారు. అరుణ గ్రహంపై ఒకప్పుడు సరస్సులు, ప్రవాహాలు, ఉత్తర మహాసముద్రం కలిగి ఉండేదని అన్నారు బెక్కీ మెక్కాలీ రెంచ్‌. అంగారక గ్రహం ఒకప్పుడు వెచ్చగా, తడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రెడ్ ప్లానెట్ చల్లగా పొడి ప్రదేశంగా ఉన్నందని చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Python Video: బాబోయ్‌ కొండచిలువ.. రోడ్డుకు అడ్డంగా.. కోళ్లును మింగేస్తున్న వీడియో..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu