Python Video: బాబోయ్ కొండచిలువ.. రోడ్డుకు అడ్డంగా.. కోళ్లును మింగేస్తున్న వీడియో..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ కొండచిలువ స్థానికుల్ని హడలెత్తించింది. సుమారు 12 అడుగులు కొండ చిలువ జనారణ్యంలోకి రావడంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. వర్షం పడిందంటే చాలు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ కొండచిలువ స్థానికుల్ని హడలెత్తించింది. సుమారు 12 అడుగులు కొండ చిలువ జనారణ్యంలోకి రావడంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. వర్షం పడిందంటే చాలు..భారీ విష సర్పాలు, కొండచిలువలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల వర్షం పడటంతో జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ రోడ్డుపై అతి పొడవైన కొండచిలువ ప్రత్యక్షమైంది. రోడ్డుకు అడ్డంగా పాకుతూ పోతున్న భారీ పామును చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. సమీప గ్రామాల్లో రోజు కోళ్లు మాయమవ్వడంతో దొంగలపనని అనుమానం పడుతున్నవారికి కొండచిలువ జనారణ్యానికి రావడంతో కొండచిలువ మింగేస్తునట్లు గుర్తించారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. కొండచిలువ దానంతట అదే సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి పోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
SBI OFFER: ఎస్‌బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..! తనఖా పెట్టిన నివాస, వాణిజ్య ఆస్తుల వేలం.. (వీడియో)