Viral Video: చిరుత Vs పైథాన్.. పోరు మాములుగా లేదుగా.. చివరికి గెలిచిందెవరంటే.?
అడవిలో చట్టాలు, నియమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. చురుకుదనం, క్రూరత్వం ఉన్న జంతువులు మాత్రమే తమ జీవనాన్ని కొనసాగించగలవు...
అడవిలో చట్టాలు, నియమాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. చురుకుదనం, క్రూరత్వం ఉన్న జంతువులు మాత్రమే తమ జీవనాన్ని కొనసాగించగలవు. కాస్త ఏమరపాటుగా ఉన్నా.. ఇతర జంతువులకు ఆహారం కావాల్సిందే. ఇదిలా ఉంటే.. జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడే కంటెంట్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
చిరుత.. ఎంతో చురుకైన, క్రూరమైన జంతువు. ఎరగా అనుకున్న జంతువును తన కంటి చూపుకు దూరం కాకముందే క్షణాల్లో వేటాడేస్తుంది. ఇక పైథాన్.. సరీసృపాలలో ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తారు. ఏ జంతువునైనా చుట్టేసి మింగేస్తుంది. అలాంటిది ఈ రెండూ ఒకదానితో ఒకటి తలబడితే.. ఎట్టుంటుంది.. ఆ పోరులో ఎవరు గెలిచారంటారు. ముందుగా ఈ వీడియోను చూడండి..
View this post on Instagram
వైరల్ వీడియో ప్రకారం.. ఓ నది దగ్గర పైథాన్ సేద తీరుతుండగా.. దాన్ని చిరుత ఎక్కడ నుంచో గుర్తించి అక్కడికి చేరుకుంటుంది. ఇక తనకు ఎరగా ఎంచుకున్న పైథాన్.. ప్రమాదకరమైనది అని గ్రహించిన చిరుత.. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. పైథాన్ తలపై తన పదునైన పంజాతో కొట్టడమే కాకుండా దాన్ని క్షణాల్లో నోటితో కరుచుకుంటుంది. అయితే పైథాన్ కూడా ఆషామాషీది కాదుగా.. చిరుత పట్టు నుంచి విడిపించుకుని నీటిలోకి జారుకుంటుంది. ఇది చాలా పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
Also Read:
ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..
సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!
కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!
బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..