Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరి ప్రయాణం.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 దేశాలు చుట్టేసిన మహిళ..! ఎలాగంటే..

క్లైర్ ఎక్కడికి వెళ్లినా, ఆమె కొన్ని గంటల పార్ట్ టైమ్ పని చేయడానికి పని కోసం వెతుకుతుంది. ఆమె ఆ క్షణం కోసం పని చేస్తుంది. దానినే ఖర్చు చేస్తుంది. అందరూ బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో వృద్ధులు ఉంటే, క్లైర్ వారిని చూసుకుంటుంది. అలాంటి పని చేయడం ద్వారా ఆమె కొంత డబ్బు సంపాదిస్తుంది. అలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయా అనే సందేహం మీకు రావచ్చు. మన దేశంలో దొరకడం కష్టం, కానీ విదేశాల్లో దొరుకుతుంది.

ఒంటరి ప్రయాణం.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 దేశాలు చుట్టేసిన మహిళ..! ఎలాగంటే..
Solo Travel
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2024 | 7:52 PM

Share

విదేశాలకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. కానీ కొంతమంది తమ విదేశీ పర్యటనలను తెలివిగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 దేశాలు తిరిగిన మహిళ గురించి తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. బ్రిటీష్ మహిళ క్లైర్ స్టర్జాకర్ తన మొదటి విదేశీ పర్యటనను ఫ్రీగా పూర్తి చేసింది. అలాగే 40 దేశాలు చుట్టేసింది. అంతేకాదు ఇప్పుడు తనలాంటి విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఎలా ప్రయాణించవచ్చో చిట్కాలు ఇస్తోంది. క్లైర్ ఇన్‌స్టాగ్రామ్‌లో టేల్స్ ఆఫ్ ఎ బ్యాక్‌ప్యాకర్ అనే పేజీని రన్‌ చేస్తోంది. ఈమెకు 25 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫుల్ టైమ్ ట్రావెల్ చేస్తూ తన ట్రావెల్ అనుభవాలను బ్లాగుల్లో షేర్‌ చేస్తూ ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బ్రిటన్‌కు చెందిన క్లైర్ ఒంటరిగానే ప్రయాణాలు చేస్తుంది. 19 సంవత్సరాల వయస్సులో ఆమె విస్కాన్సిన్‌లోని ఒక గడ్డిబీడుకు తన ఫస్ట్‌ టూర్ ప్లాన్‌ చేసుకుంది.. వేసవిలో అక్కడ పొలానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించేది. అంతేకాదు.. అలా పని చేస్తూనే గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. పనిచేసి డబ్బు సంపాదించేదట. తన ట్రిప్‌కు కొంత డబ్బు ఖర్చైన కూడా తను సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి.. అది తనకు ఫ్రీ ట్రిప్‌గా పరిగణిస్తానని క్లైర్ చెప్పింది.

20 సంవత్సరాల తర్వాత క్లైర్ ఇప్పటికీ పర్యటనలు చేస్తోంది. అలాగే ఎక్కడికెళ్లినా పనిచేసి డబ్బు సంపాదిస్తోంది. క్లైర్ ఎక్కడికి వెళ్లినా, ఆమె కొన్ని గంటల పార్ట్ టైమ్ పని చేయడానికి పని కోసం వెతుకుతుంది. ఆమె ఆ క్షణం కోసం పని చేస్తుంది. దానినే ఖర్చు చేస్తుంది. అందరూ బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో వృద్ధులు ఉంటే, క్లైర్ వారిని చూసుకుంటుంది. అలాంటి పని చేయడం ద్వారా ఆమె కొంత డబ్బు సంపాదిస్తుంది. అలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయా అనే సందేహం మీకు రావచ్చు. మన దేశంలో దొరకడం కష్టం, కానీ విదేశాల్లో దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

విదేశీయులు ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తారు. క్లైర్ అటువంటి ప్రకటనలను చూసి వారిని సంప్రదిస్తుంది. ఆ దేశాల్లో పని చేస్తుంది. కాబట్టి ఆమె తన పర్యటన కోసం కొన్ని గంటలు పనిచేసి డబ్బు సంపాదిస్తుంది. అక్కడి టూరిస్ట్ ప్లేసెస్ చూసి ఆమె తిరిగి వస్తుంది.

క్లైర్ తన బ్లాగ్ నుండి కూడా ఇప్పుడు డబ్బు సంపాదిస్తోంది. అలాగే, చౌకగా ప్రయాణించే చిట్కాల కోసం ఆమె $10 వసూలు చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఆమె తన స్వంత వెబ్‌సైట్ https://talesofackpacker.com/link-in-bio/ ని కూడా నడుపుతోంది. ఇప్పుడు ఉద్యోగానికి బదులుగా, క్లైర్ తన స్వంత ప్రత్యేకమైన వృత్తిని రూపొందించుకుంది. దీంతో ఓ వైపు డబ్బు సంపాదిస్తూనే మరోవైపు విదేశాలకు కూడా తిరుగుతోంది. కాబట్టి ఆమె ప్రతిరోజూ కొత్త ప్రదేశాలను చూస్తుంది. అలా ఆమె ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు