Alexa: ఎవర్రా మీరంతా.. అలెక్సాను అడిగేది ఈ ప్రశ్నలేనా.? అవెంటో తెలిస్తే నవ్వు ఆపుకోవడం అసాధ్యం..
మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మనిషి ఊహకు కూడా అందని ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్చువల్ అసిస్టెంట్స్‌కి ప్రాచుర్యం బాగా పెరిగింది. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, వాయిస్..
మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మనిషి ఊహకు కూడా అందని ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్చువల్ అసిస్టెంట్స్‌కి ప్రాచుర్యం బాగా పెరిగింది. అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడం, వాయిస్ అసిస్టెంట్ ధరలు కూడా తక్కువగా ఉండడం వల్ల వీటి వినియోగం పెరిగింది. ఇలాంటి వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లలో అలెక్సా ఒకటి. అయితే అలెక్సాను కొందరు యూజర్లు అడిగే ప్రశ్నలు నవ్వించకమానదు. అలా 2022లో యూజర్లు అలెక్సాను అడిగిన కొన్ని వింత ప్రశ్నలపై ఓ లుక్కేయండి..
మరీ ఇంత విచిత్రమైన ప్రశ్నలా..
* “అలెక్సా, నీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా?”
* “అలెక్సా, నీ నోరు ఎక్కడ ఉంది?”
* “అలెక్సా, నా కోసం నా హోంవర్క్ చేయగలవా?”
* “అలెక్సా, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి”
* “అలెక్సా, నీకు భర్త ఉన్నాడా?”
* “అలెక్సా, నువ్వు ఎప్పుడైనా అల్లరి చేశావా?”
సినిమాకు సంబంధించి..
* “అలెక్సా, నీకు చోటా భీమా తెలుసా?”
* “అలెక్సా, రాకీ సోదరుడు ఎవరు?”
* “అలెక్సా, పెప్పా పిగ్ సోదరుడు ఎవరు?”
* “అలెక్సా, థానోస్ గురించి చెప్పు”
* “అలెక్సా, మిక్కీ మౌస్ వయస్సు ఎంత?”
* “అలెక్సా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?”
* “అలెక్సా, షోలే డైలాగ్స్ చెప్పు”
* “అలెక్సా, లిటిల్ సింగం ఎవరు?”
సెలబ్రీటీల గురించి..
* “అలెక్సా, అలియా భట్ వయసు ఎంత?”
* “అలెక్సా, అనుష్క శర్మ పాప పేరేంటి?”
* “అలెక్సా, విజయ్ దేవరకొండ ఎవరు?”
* “అలెక్సా, ప్రిన్స్ హ్యారీ వయస్సు ఎంత?”
* “అలెక్సా, కత్రినా కైఫ్ ఎంత ఎత్తు?”
* “అలెక్సా, రష్మిక మందన గురించి చెప్పు?”
ఫుడ్‌కి సంబంధించి..
ఆహార ప్రశ్నలు
* “అలెక్సా, చికెన్ కర్రీ రెసిపీ ఏమిటి?”
* “అలెక్సా, మసాలా టీ ఎలా తయారు చేయాలి?”
* “అలెక్సా, పనీర్ బటర్ మసాలా ఎలా తయారు చేస్తారు?”
* “అలెక్సా, ఎగ్ బిర్యానీ ఎలా చెయ్యాలి?”
* “అలెక్సా, దోసె ఎలా తయారుచేస్తారు?”
* “అలెక్సా, మసాలా పనీర్ టిక్కా పిజ్జా ఎలా తయారు చేయాలి?”
* “అలెక్సా, బ్రౌన్ రైస్‌తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలి?”
జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి..
* “అలెక్సా, బుర్జ్ ఖలీఫా ఎంత ఎత్తుగా ఉంది?”
* “అలెక్సా, భూమిపై అత్యంత ఎత్తైన వ్యక్తి ఎవరు?”
* “అలెక్సా, ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడు ఎవరు?”
* “అలెక్సా, శ్రీలంక భాష ఏమిటి?”
* “అలెక్సా, గ్రహాంతర వాసులు ఉన్నారా?”
* “అలెక్సా, ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎవరు?”
* “అలెక్సా, ఎలోన్ మస్క్ ఆస్తి ఎంత?”
* “అలెక్సా, బిట్‌కాయిన్ విలువ ఏమిటి?”
* “అలెక్సా, ఈ రోజు బంగారం ధర ఎంత?”
* “అలెక్సా, నీరు ఎందుకు తడిగా ఉంది?”
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..