ప్రేమంటే ఇదే మరి.. పెంపుడు కుక్కకు శ్రీమంతం.. అదుర్స్ అంటున్న జనాలు..
చాలమందికి జంతువులంటే చాలా ఇష్టపడుతుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కుక్క పిల్లలను, పిల్లులను, పక్షులను
చాలమందికి జంతువులంటే చాలా ఇష్టపడుతుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కుక్క పిల్లలను, పిల్లులను, పక్షులను పెంచుకుంటారు. మరీ ముఖ్యంగా కుక్క పిల్లలను పెంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాటిన తమ ఇంట్లో సభ్యులుగా చూస్తుంటారు. తమతోపాటే వాటికి కూడా అన్నింట్లోనూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలకు పుట్టినరోజు వేడుకలు జరిపిన ఘటనలు చూసాం.. కానీ తాజాగా ఓ కుటుంబం మాత్రం తమ పెంపుడు కుక్కకు ఘనంగా శ్రీమంతం వేడుక నిర్వహించారు.
తమిళనాడులోని తేని జిల్లాలోని ఒక కుటుంబం తన పెంపుడు కుక్క కోసం శ్రీమంతం నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆ కుక్క మెడ చుట్టూ ఎర్రటి వస్త్రం చుట్టి.. మెడలో దండ వేసి.. ముందు పండ్లు, గాజులు… పసుపు,కుంకుమ కూడా ఉన్నాయి.. కుమారేశన్ ఉప్పుకొట్టై నివాసి.. అతనికి ఒక కుమారుడు.. కుమార్తె ఉన్నారు. వారికి చిన్నప్పటి నుంచి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం.దీంతో వారి కోసం అనేక కుక్క పిల్లలను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం వారి ఇంట్లో 10 వరకు కుక్క పిల్లలున్నాయి. అందులో ఓ కుక్క పేరు సిల్క్. ఈ కుక్కకు కుమారేశన్ కుటుంబం శ్రీమంతం వేడుకను నిర్వహించింది. గతంలో కూడా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కూడా ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు శ్రీమంతం నిర్వహించారు.
Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం