Viral: అమానుషం.. బిస్కెట్ల కోసం బాలుడితో కాళ్లు పట్టించారు.. అధికారుల తీరుపై మండిపడుతున్న నెటిజన్స్
సమాజంలో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. తమ కంటే చిన్న స్థాయిలో ఉన్న వారి పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఏమీ లేయలేరనే ధీమా, ఎదురుతిరగలేరనే విశ్వాసంతో దారుణాలకు తెగబడుతున్నారు. చక్కగా పాఠశాలకు..
సమాజంలో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. తమ కంటే చిన్న స్థాయిలో ఉన్న వారి పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఏమీ లేయలేరనే ధీమా, ఎదురుతిరగలేరనే విశ్వాసంతో దారుణాలకు తెగబడుతున్నారు. చక్కగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన బాలుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు పలువురు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. మధ్య ప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. బిస్కెట్లు ఇస్తామని ఆశ చూపి కాళ్లు పట్టించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమం ట్విటర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి హాయిగా సోఫాలో కూర్చుని ఉండగా బాలుడు కింద నేలపై కూర్చుని అతని కాళ్లు నొక్కుతున్నాడు. ఈ ఘటన షాడోల్‌లోని బియోహారీ సివిల్ హాస్పిటల్‌లో జరిగింది. ఘటనపై ఆరా తీయగా బాలుడికి బిస్కెట్లు ఆశ చూపి ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది ఇంకా స్పందించలేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదని, కాళ్లు పట్టించకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
#शहडोल: #ब्यौहारी सिविल अस्पताल का कर्मचारी बिस्किट का लालच देकर बच्चे से करा रहा #पैरों की #मालिश @dmshahdol @proshahdol @Shahdol @PublicShahdol @PublicShahdol #shahdol @healthminmp pic.twitter.com/jFXP32QckX
ఇవి కూడా చదవండి— Akhilesh jaiswal (@akhileshjais29) September 6, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.