Mystery Of Birds Suicide: పక్షుల సూసైడ్ పాయింట్ !! అంతుచిక్కని మిస్టరీ !!
అస్సాంలోని జటింగా, బోరైల్ కొండల మధ్య ఓ గ్రామానికి యేటా సెప్టెంబరు నవంబర్ మధ్య వేల సంఖ్యలో పక్షులు తరలివచ్చి మరణిస్తుంటాయి.
అస్సాంలోని జటింగా, బోరైల్ కొండల మధ్య ఓ గ్రామానికి యేటా సెప్టెంబరు నవంబర్ మధ్య వేల సంఖ్యలో పక్షులు తరలివచ్చి మరణిస్తుంటాయి. ఈ ప్రాంతానికి పక్షుల ఆత్మహత్య కేంద్రం అని పేరు. కారణం ఏమిటో తెలియక పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆత్మహత్య చేసుకునే ధోరణి మనుషుల్లో సర్వసాధారణం. అదే పక్షులు, ఇతర జంతువుల్లో చాలా అరుదుగా మత్రమే ఉంటుంది. ఈ గ్రామంలో పక్షులు గాలిలో ఎగురుతూ వేగంగా వచ్చి ఇళ్లు లేదా చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపరచుకుని మృతి చెందుతాయి. విచిత్రమేంటంటే.. ఈ పక్షులు రాత్రి గూళ్లకు చేరుకుంటాయి. సరిగ్గా రాత్రి 7 నుంచి 10 గంటల మధ్యలో ఇలా ప్రవర్తిస్తాయి. దాదాపు 40 రకాల స్థానిక, వలస పక్షులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయి. కాగా అయస్కాంత శక్తి వల్ల ఈ ప్రాంతంలోని పక్షులు మృతి చెందుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాంత వాతావరణంలోని తేమ, పొగమంచు, వేగంగా వీచే గాలులు, సరైన వెలుతురు లేకపోవడంతో.. పక్షులకు స్పష్టంగా కళ్లు కనిపించక ఇళ్లు, చెట్లను, వాహనాలను ఢీ కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య అనుష్కతో కలిసి అక్కడ 8 ఎకరాలు కొన్న కోహ్లి !! ధర ఎంతంటే ??
చైనా అధ్యక్షుడి కూతురి ఫొటో లీక్ చేశాడు.. చుక్కలు చూస్తున్నాడు
ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా
ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు
వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..