ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు
కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు లేదా గృహ ప్రవేశ కార్యక్రమంలో మొదట పూజ చేసి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లడం ఆనవాయితీ.
కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు లేదా గృహ ప్రవేశ కార్యక్రమంలో మొదట పూజ చేసి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లడం ఆనవాయితీ. గేటు ముందు నిలబడి గుమ్మడి కాయతో హారతి ఇచ్చే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అనేక సందర్భాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తూ పూజచేస్తున్నాడు. గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి దిష్టితీశారు. అనంతరం దానిని పగలగొట్టడానికి నేలపై బలంగా కొట్టాడు. అయితే ఆ సమయంలో గుమ్మడికాయ నేలపై పడిపోగా.. గుమ్మడికాయపై వెలిగించిన కర్పూరం ఆయన తలపై పడింది. ఊహించని పరిణామానికి షాక్ తిన్న ఆయన వెంటనే అప్రమత్తమై దానిని కిందపడేస్తాడు. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ లైక్స్ చేస్తున్నారు. అంతేకాదు, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ‘పద్ధతి తప్పు అయినప్పుడు ఫలితం కూడా తప్పుగా ఉంటుంది’ అని, ‘జోష్, ఉత్సాహం కొన్నిసార్లు పెద్ద తప్పులు చేస్తాయి.’ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..
ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!
Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!
ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

