వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..
విమానాలను హైజాక్ చేయడం చూశాంకానీ, అమెరికాలోని మిసిసిపీలో మాత్రం ఒక దుండగుడు ఏకంగా విమానాన్ని దొంగిలించి, కూల్చేస్తానని హెచ్చరించాడు.
విమానాలను హైజాక్ చేయడం చూశాంకానీ, అమెరికాలోని మిసిసిపీలో మాత్రం ఒక దుండగుడు ఏకంగా విమానాన్ని దొంగిలించి, కూల్చేస్తానని హెచ్చరించాడు. మిసిసిపీ నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్ మీద విమానాన్ని కూల్చేస్తానని బెదిరించాడు. చివరకు అతని విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. దాంతో అలర్ట్ అయిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు.. నిందితుడి బెదిరింపులతో వాల్‌మార్ట్ స్టోర్ ప్రాంతం అంతా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. అంతేకాదు వాల్‌మార్ట్‌ను ఖాళీ చేశారు. ఆ ప్రాంతం వైపు ఎవరూ రాకూడదంటూ పోలీసులు హెచ్చరించారు. తొమ్మిది సీట్లు ఉన్న చిన్న విమానాన్ని టుపెలో ఎయిర్‌పోర్ట్ నుంచి 29 ఏళ్ల యువకుడు దొంగిలించాడు. అప్పటినుంచి దాన్ని కూల్చేస్తానంటూ గాలిలో చక్కర్లు కొడుతూ బెదిరించాడు. దీంతో పోలీసులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలు అలర్ట్ అయ్యాయి. అధికారులు – ఆ పైలట్‌తో మాట్లాడారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే, అతను విమానాన్ని ఎందుకు ఎత్తుకెళ్లాడు, ఎందుకిలా బెదిరింపులకు పాల్పడ్డాడనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, విమానం చెక్కర్లు కొట్టడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!
Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!
ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

