Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!
పామును ఎదురించి బతికి బయటపడటం ఏ జీవికి అంత సాధ్యం కాదు. అది వేసే కాటు వల్ల జంతువులు వెంటనే చనిపోతాయి.
పామును ఎదురించి బతికి బయటపడటం ఏ జీవికి అంత సాధ్యం కాదు. అది వేసే కాటు వల్ల జంతువులు వెంటనే చనిపోతాయి. కేవలం ముంగిస మాత్రమే దాని విషాన్ని సహించగలదు. అలాంటిది ప్రకృతి వైచిత్రి ఒకటి చోటుచేసుకుంది. అల్పజీవిగా భావించే సాలె పురుగు చేతిలో కాలనాగు ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “బలవంతమైన సర్పము.. చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! ” అని సుమతీ శతకంలో చెప్పినట్లుగా.. ఎవరిని తక్కువ చేసి చూడకని వేదాంత సారం. ప్రకృతిలోని ప్రతి జీవిని గౌరవించాలన్నదే సనాతనధర్మ ప్రభోదం. ఈ క్రమంలోనే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకున్న సాలె పురుగు పామును అంతం చేసింది. సాలె గూడులోకి వచ్చిన కాలనాగుపై ఎదురుతిరిగి పోరాడింది. అంత బలమైన పాము సైతం సాలె పురుగును ఎదుర్కోలేక మరణిస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

