Viral Video: ఇదేందయ్యా ఇది.. కొండ నుంచి పుట్టుకొస్తున్న మేఘాలు.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
మేఘాలు (Clouds) ఎలా ఏర్పడతాయో మనకు తెలిసిందే. సూర్యరశ్మి ద్వారా నీరు ఆవిరై.. ఆ తర్వాత చల్లబడి మేఘాలు రూపంలో మారి వర్షాలు కురిపిస్తాయనే విషయాన్ని మనం చిన్నప్పుడే నేర్చేసుకున్నాం. ఈ ప్రక్రియ...
మేఘాలు (Clouds) ఎలా ఏర్పడతాయో మనకు తెలిసిందే. సూర్యరశ్మి ద్వారా నీరు ఆవిరై.. ఆ తర్వాత చల్లబడి మేఘాలు రూపంలో మారి వర్షాలు కురిపిస్తాయనే విషయాన్ని మనం చిన్నప్పుడే నేర్చేసుకున్నాం. ఈ ప్రక్రియ అంతా ఓ సైకిల్ లా జరుగుతుందని కూడా మనకు తెలిసు. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ మేఘాలకు పుట్టినిల్లుగా మారింది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతూనే ఉన్నాయి. యూకేలో ఉంది ఈ అద్భుత వింత. జీబ్రాల్టర్ ద్వీపకల్పంలో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఈ కొండ ఉంది. జీబ్రాల్టర్ ద్వీపకల్పంలో ఉంది కాబట్టి దీనికీ జీబ్రాల్టర్ మౌంటేనే అనే పేరు వచ్చింది. మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల ఎత్తున శిఖరం ఉంటుంది. అది నిటారుగా ఉండి గాలికి అడ్డుగా నిలిచింది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా మేఘాలు ఏర్పడుతున్నాయి.
The London Gatwick @easyJet flight taxiing and taking off from @RAF_Gib this morning with the backdrop of some impressive #Levanter cloud over the Rock of #Gibraltar
ఇవి కూడా చదవండిThe #levanter cloud just keeps getting better today! #LevanterSpam pic.twitter.com/WYyOPktSij
— Met Office Gibraltar (@MetOGibraltar) August 24, 2022
ఎక్కడైనా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటిని తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి. ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్ క్లౌడ్’గా పిలుస్తారట. జీబ్రాల్టర్ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే విధంగా ఏర్పడినవని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. ఏటా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ చిత్రాన్ని చూడవచ్చు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఈ కొండ, ఈ ప్రాంతం అద్భుతమని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.