AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: వరుడి మెడలో దండ వేయలేకపోయిన వధువు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Funny Video: పెళ్లికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి వధూవరులకు

Funny Video: వరుడి మెడలో దండ వేయలేకపోయిన వధువు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Funny Video
uppula Raju
|

Updated on: Sep 18, 2021 | 5:46 PM

Share

Funny Video: పెళ్లికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి వధూవరులకు మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం మరిచిపోని విధంగా ఉంటాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అంతేకాదు ఇలాంటి వీడియోలు ఇంటర్‌నెట్‌లో తొందరగా వైరల్‌ అవుతాయి. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.

వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలో వధూవరులను వారి సోదరులు పైకి ఎత్తడం మనం గమనించవచ్చు. తర్వాత ఇద్దరు ఒకరి మెడలో ఒకరు దండ వేయాలని కోరుతారు. మొదటగా వరుడు.. వధువు మెడలో దండ వేస్తాడు. తర్వాత వధువు ఆ పని చేయాల్సి వస్తుంది. వధువు ప్రయత్నిస్తుంది కానీ కుదరదు. దండ కింద పడటం మనం వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పదే పదే వీక్షిస్తూ వారి పెళ్లినాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ వీడియో వైరల్‌క్లిప్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. వెంటనే ఈ వీడియోను చాలామంది వీక్షించారు. నెటిజన్లకు బాగా నచ్చుతోంది. చాలామంది లైక్స్‌, షేర్స్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత కొంతమంది ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక వినియోగదారు హ్యాపీ మ్యారేడ్ లైఫ్‌ అని చెప్పాడు. మరొక యూజర్ ఇలా రాశాడు వీడియో చాలా నవ్వుతెప్పిస్తుందని, తన వివాహాన్ని గుర్తు చేసిందని అన్నాడు. ఇంకొకరు పెళ్లిలో ఇలాంటి సంఘటనలు చాలా నవ్వుతెప్పిస్తాయని, మధురక్షణాలుగా మిగిలిపోతాయని తెలిపాడు. ఏది ఏమైనా ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది.

గుళకరాళ్ల మధ్య కప్ప దాగి ఉంది..! కానీ చాలామంది దీనిని కనుగొనలేకపోయారు.. మీరు ట్రై చేయండి..

Dr Ganesh Rakh: ఆడపిల్లను కాపాడే ఉద్యమం చేస్తున్న ఓ డాక్టర్.. తన ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ఫీజు మాఫీ.. ఎక్కడంటే

Sai Daram Tej: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వెంటిలేటర్ తొలగించిన అపోలో వైద్యులు..