AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుళకరాళ్ల మధ్య కప్ప దాగి ఉంది..! కానీ చాలామంది దీనిని కనుగొనలేకపోయారు.. మీరు ట్రై చేయండి..

Viral Picture: కొంతమంది తమ మెదడు పని చెప్పడానికి పజిల్స్ ఆడుతుంటే.. మరికొందరు కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తారు.

గుళకరాళ్ల మధ్య కప్ప దాగి ఉంది..! కానీ చాలామంది దీనిని కనుగొనలేకపోయారు.. మీరు ట్రై చేయండి..
Lllll 2
uppula Raju
|

Updated on: Sep 18, 2021 | 5:11 PM

Share

Viral Picture: కొంతమంది తమ మెదడు పని చెప్పడానికి పజిల్స్ ఆడుతుంటే.. మరికొందరు కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తారు. ఇంకొందరైతే కష్టమైన ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఓ వేదికగా నిలిచింది. ఇక పజిల్స్ విషయానికి వస్తే.. మనకు రోజూ ఎన్నో రకాల పజిల్స్ పేపర్లలోనూ, నెట్టింట్లో సందడి చేస్తుంటాయి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఓ గుళకరాళ్ల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇందులో కప్ప దాగుంది. అయితే దీనిని కనుగొనడానికి నెటిజన్లు తెగ కష్టపడుతున్నారు.

గ్లెండా ఆడమ్స్ ఫిలిప్స్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటోను షేర్‌ చేశాడు. అతను ఈ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ అందులో కప్పను వెతకడం ప్రారంభించారు. కానీ అంత సులభంగా కప్ప కనిపించిందా అంటే ఒక్కరి దగ్గరి నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. దీంతో గ్లెండా తన ఫోన్ నుంచి ఆ కప్ప చిత్రాన్ని తీసింది. వాస్తవానికి నీరు, గులకరాళ్ల మధ్య దాక్కున్న కప్ప చాలా చిన్నది. అందుకే ఈ చిత్రంలో దానిని కనుగొనడం కష్టమైన పని.

గ్లెండా ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి కప్పను కనుగొనమని ప్రజలకు సవాలు విసిరారు. అతడి సవాలును స్వీకరించిన చాలామంది కప్పను కనుగొనడానికి ప్రయత్నించారు. ఫోటోను చాలా జాగ్రత్తగా గమనించారు అయినా కప్పను కనుగొనలేకపోయారు. కొంతమంది చిరాకు పడ్డారు. మరికొందరు అందులో కప్ప దాగి లేదని చెప్పారు. ఇంకొందరు ఈ ఫోటో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఏది ఏమైనప్పటికీ కప్ప ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం.

Frog

Frog

Aadhaar: ఆధార్ వినియోగదారులకు గమనిక.. డేట్‌ ఆఫ్ బర్త్‌, జెండర్‌ మార్చుకోవడానికి ఒకే అవకాశం..!

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధం.. నోటిఫికేషన్ వచ్చేసింది. పోలింగ్ ఎప్పుడంటే..

Bigg Boss5: బిగ్‌ బాస్‌ బ్యాచ్‌లర్స్ పులిహోర కథ.. లైవ్ వీడియో