Big Traffic Jam: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్.. 12 రోజులు రోడ్డు మీదనే!
ట్రాఫిక్ జామ్ అంటే రెండు, మూడు గంటలకు మించి ఉండదు. మహా అయితే ఓ పూట సమయం పడుతుంది. వర్షాలు పడితే ఒక్కోసారి రోజంతా ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు. కానీ ఒక దగ్గర మాత్రం ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనాలు అక్కడే రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది..
సాధారణంగా ట్రాఫిక్ జామ్ అంటే మహా అయితే రెండు, మూడు గంటలు. వర్షాలు పడినప్పుడు మాత్రం ఓ పూట పడుతుంది. ఎందుకంటే ఎక్కడిక్కడ నీరు నిల్వ ఉండి.. వాహనాలు వెళ్లేందుకు దారి ఉండదు. అంతకు మించి మరీ ఎక్కువ సేపు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడదు. కానీ ఇక్కడ మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏకంగా 12 రోజులు సమయం పట్టింది. అంతవరకూ జనాలు అందరూ రోడ్ల మీదనే పడి గాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? అని ఆలోచిస్తున్నారా.. చైనాలో.. ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చైనా చరిత్రలో జరిగిన ఘటనల్లో ఇది కూడా గుర్తిండిపోయే రోజు. జనాలు వాహానాల్లోనే తిని తాగి నిద్రించేవారు. 2010 ఆగష్టు 14న ఈ ఘటన జరిగింది.
చైనాలోని బీజింగ్‌లో అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే పొడవైన ట్రాఫిక్ జామ్‌గా నమోదైంది. ట్రాఫిక్ జామ్‌లో ఇది ప్రపంచ రికార్డు. ఆ సమయంలో చైనా జాతీయ రహదారి 110పై లక్షలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. పై నుంచి ఫొటో తీస్తే.. చిన్న చీమల మాదిరిగా వాహనాలు కనిపించాయి.
మంగోలియా నుంచి బీజింగ్‌కు బొగ్గు, నిర్మాణ సామగ్రి ట్రక్కులు తీసుకు వెల్లడం వల్ల ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలోనే టిబేట్, బీజింగ్ హైవే నిర్మాణం కూడా జరుగుతుంది. దీంతో లక్షలాది జనం ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. కేవలం రోజుకు ఒక కిలో మీటర్ మాత్రమే వాహనాలు కదిలేవి. కొన్ని వాహనాలు అయితే.. మధ్యలోనే చెడిపోయి నిలిచిపోయాయి. ఆకలి, దాహంతో అక్కడే చిక్కుకు పోయారు. వాహనాల్లోని తిని.. అక్కడే నిద్రించేవారు. కార్లే ఇల్లులుగా మారాయి. చైనా అధికారులు కూడా వాహనాలను త్వరగా తరలించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. చివరికి ఆగష్టు 2010 26, 27 తేదీలకు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యింది. దీంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..