Viral Video: వాటే ఐడియా మేడమ్.. ఉచిత బస్సులో ఊరికే వెళ్లకుండా.. భలేగా టైమ్ సేవ్ చేస్తున్నారే..!
చాలా సందర్భాల్లో ఈ ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం, ఎగబడి కొట్టుకోవటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు అవసరం ఉన్నా.. లేక పోయినా ఉచిత బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకొందరు బస్సులో ప్రయాణిస్తూ ఇంటికి అవసరమైన పనులు చేసుకుంటున్నారు. అలాంటి వీడియో తరచూ నెట్టింట వైరల్ కావటం మనం చూస్తున్నాం. తాజగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు బాగా కలిసొచ్చింది. ఆడవారి కోసం సీఎం రేవంత్ సర్కారు బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని పెద్ద సంఖ్యలో ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీబస్ జర్నీతో మహిళా ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. కానీ, ఉచిత బస్సు పుణ్యామా.. అని ప్రతిరోజు ఏదో ఒకచోట వింత వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఈ ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం, ఎగబడి కొట్టుకోవటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు అవసరం ఉన్నా.. లేక పోయినా ఉచిత బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకొందరు బస్సులో ప్రయాణిస్తూ ఇంటికి అవసరమైన పనులు చేసుకుంటున్నారు. అలాంటి వీడియో తరచూ నెట్టింట వైరల్ కావటం మనం చూస్తున్నాం. తాజగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉచిత సదుపాయంతో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. షాపింగ్‌ల పేరిట కొందరు, పుణ్యక్షేత్రల దర్శనార్థం చాలా మంది ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇక ఫ్రీ బస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ వెల్లుల్లి పొట్టు తీస్తుండగా బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు అదంతా వీడియో తీశారు. ఈ ఘటన హన్మకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న బస్సులో చోటు చేసుకుంది. బస్ జర్నీ చేస్తూనే ఆమె ఏంచక్కా వెల్లుల్లీ పొట్టు తీసుకుంటోంది. కొందరు ఆమె చేస్తున్న నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తవైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇదేంది నాయన ఫ్రీబస్సు సదుపాయాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటారా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు రైలు, బస్సులో ప్రయాణిస్తూ బిస్కట్లు, పల్లీ బఠాణీలు, ఇతర స్నాక్స్ వంటివి తినేవాళ్లు. కానీ ఇప్పుడు మహిళలు మాత్రం.. తమకు ఇంటి వద్ద టైమ్ సరిపోవటం లేదని..ఇలా బస్ జర్నీ చేస్తు ఇంటి పనులతో టైమ్ పాస్ చేస్తున్నారంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా ఫ్రీ బస్ జర్నీ ఆడవారికి బాగానే కలిసొచ్చిందని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..