Bike stunt into crocodile lake: ఇదేం రీల్స్ పిచ్చిరా బాబు..300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్.. కట్‌చేస్తే..
ఇంకొందరు పాములతో కరిపించుకోవటం, వాటికి ముద్దుపెట్టడం వంటి విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వారి లిస్ట్‌లో మరో యువతరం చేరింది. ఇక్కడ కొండరు యువకులు థ్రిల్ కోసం మొసళ్లతో నిండిన సరస్సులో కార్లు, బైక్‌లను నడుపుతూ అందరినీ ఆందోళనకు గురిచేశారు. వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు 20 మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
సోషల్ మీడియా యుగంలో యువత రీళ్లకు బానిసలుగా మారిపోయారు. రీల్స్ మోజులో ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తున్నారు. కొంతమంది స్పీడ్‌గా వెళ్తున్న రైలుతో పరిగెడుతుంటారు. మరికొందరు ఎత్తైన కొండలు, గుట్టలు, ఎత్తైన భవనాలపై నుంచి దూకటం వంటివి పోటీగా పెట్టుకుంటారు. ఇంకొందరు పాములతో కరిపించుకోవటం, వాటికి ముద్దుపెట్టడం వంటి విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వారి లిస్ట్‌లో మరో యువతరం చేరింది. ఇక్కడ కొండరు యువకులు థ్రిల్ కోసం మొసళ్లతో నిండిన సరస్సులో కార్లు, బైక్‌లను నడుపుతూ అందరినీ ఆందోళనకు గురిచేశారు. వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు 20 మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా లో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. సిలిసెహర్ మొసళ్ల పార్క్‌లో ఒక వ్యక్తి బైక్ తో విన్యాసాలు చేశారు. ఏకంగా 300 మొసళ్లు ఉన్న ఆ సరస్సులో అతడు బైక్ రైడ్ చేస్తూ ప్రమాదకర విన్యాసాలు చేశాడు. ఆ సరస్సు నిండా మొసళ్లు నోరు తెరుచుకుని ఉంటాయి. దీంతో అక్కడి వాళ్లు కనీసం.. సరస్సు దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించారు. అలాంటిది కొందరు యువకులు బైక్ లు, జీప్ లతో విన్యాసాలు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.
#Alwar – सिलीसेढ़ झील में बाइक और कार चलाते हुए कुछ युवकों का वीडियो आया सामना, अकबरपुर पुलिस ने वीडियो बनाने वाले युवकों को और साथ ही 7 बाइक, एक कार बरामद की#sadhnaplusnewsrajasthan #siliserhlake #rajasthangovt #akbarpurpolice pic.twitter.com/7EtJCFBrO3
— Sadhna Plus News Rajasthan (@sadhnaplusraj) July 16, 2024
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వీడియో ఆధారంగా గత 2 రోజుల్లో మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు. అంతేకాకుండా, వారి SUV లు, వీడియోలో ఉపయోగించిన ప్రతి బైక్‌ను జప్తు చేశారు. నిందితులంతా బరోడాలోని సర్ఖా కాలా గ్రామ నివాసితులని తెలిపారు. నిందితులను అరెస్టు చేయడమే కాకుండా రెండోసారి ఎవరూ ఇలాంటి స్టంట్ చేయకూడదని ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను మోహరించారు. సంబంధిత రహదారిని కూడా మూసివేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..