Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivetha Pethuraj: భోజనంలో బొద్దింక; రెస్టారెంట్ పై స్విగ్గీకి ఫిర్యాదు చేసిన తమిళ హీరోయిన్!

బాగా ఆకలేస్తోందని స్విగ్గీలో భోజనం ఆర్డర్ చేసిందో తమిళ హీరోయిన్. తీరా పార్సిల్ వచ్చాక ఆతృతగా తిందామని ప్యాకెట్ ఓపెన్ చేసింది. భోజనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది.

Nivetha Pethuraj: భోజనంలో బొద్దింక;  రెస్టారెంట్ పై స్విగ్గీకి ఫిర్యాదు చేసిన తమిళ హీరోయిన్!
Nivetha Pethuraj
Follow us
Venkata Chari

|

Updated on: Jun 24, 2021 | 6:24 PM

Nivetha Pethuraj: బాగా ఆకలేస్తోందని స్విగ్గీలో భోజనం ఆర్డర్ చేసిందో తమిళ హీరోయిన్. తీరా పార్సిల్ వచ్చాక ఆతృతగా తిందామని ప్యాకెట్  ఓపెన్ చేసింది. భోజనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. భోజనంలో బొద్దింకను చూసి గట్టిగా కేకలు వేసింది. ప్యాకెట్ లో బొద్దింకను చూసి ఆకలి కూడా ఆవిరైపోయిందంట పాపం ఆ హీరోయిన్ కి. దీంతో సోషల్ మీడియా వేదికగా రెస్టారెంట్ పై ఫైర్ అయింది. అలాగే సంబంధిత రెస్టారెంట్ పై స్విగ్గీకి ఫిర్యాదు చేసి ఫొటోలను నెట్టింట్లో విడుదల చేసింది.

తమిళ హీరోయిన్ నివేథా పెతురాజ్ విషయంలోనే జరిగింది ఈ తంతు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది. “స్విగ్గీ తోపాటు రెస్టారెంట్లు ఈ రోజుల్లో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు నాకైతే తెలియడం లేదు. నేను ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో బొద్దింకలను రెండుసార్లు గమనించాను. ఈ సారి మాత్రం కంప్లయింట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మూన్‌లైట్ టేకావే ఓమర్ రెస్టారెంట్ ను ప్రతిరోజూ తనిఖీ చేసి, నిబంధనలు పాటించకుంటే, భారీగా జరిమానాలు విధించాలని” ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే రెస్టారెంట్ పై తనకు ఇతరుల నుంచి సందేశాలు వస్తున్నాయని, ఫిర్యాదు చేసి మంచి పని చేశారంటూ కొంతమంది మెసేజ్ లు పంపారని పేర్కొంది. “ఈ రెస్టారెంట్ నుంచి పార్శిళ్లలో బొద్దింకలను గమనించడం ఇది మొదటిసారి కాదని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? ఈ రెస్టారెంట్‌ను లిస్టు నుంచి తొలగించాలని” స్విగ్గీని కోరింది.

ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక.. కొంతమంది ఫాలోవర్లు కూడా ఇలాంటి అనుభవమే అయిందంటూ కామెంట్లు చేశారు. “ఈ రెస్టారెంట్‌తో నాకు ఇలాంటి అనుభవమే అయింది” అంటూ ఒకరు రాస్తే.. “నేను కూడా మూన్‌లైట్ రెస్టారెంట్ నుంచి ఇలాంటి బొద్దింకలను మూడుసార్లు గమనించాను… ఈ రెస్టారెంట్‌ను స్విగ్గీ నుంచి తొలగిస్తారని ఆశిస్తున్నాను” అని కామెంట్ చేశారు. ఇక మరొకరు “నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన తర్వాత, వాటిపై భారీగా ఫైన్‌లు వేస్తానంటూ” రాసుకొచ్చారు.

Nivetha Pethuraj2

Nivetha Pethuraj Instagram

మరోవైపు, ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన సమస్యను పరిష్కరిచేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు నివేథా పేర్కొంది. ఈమేరకు స్విగ్గీ పంపిన మెసేజ్‌ ను చూపించింది. “నివేతా, మాపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు. ఈ విషయంలో మీ ఓపికను అభినందిస్తున్నాం. మా బృందం త్వరలోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తుంది” అంటూ స్విగ్గీ ట్వీట్ చేశారని రాసుకొచ్చింది.

నివేథా పెతురాజ్.. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా నటించిన సంగమిమిజన్ లో చివరిసారి కనిపించింది. ‘ఓరు నాల్ కూతు’ హీరోయిన్ విరాట పర్వం లో సందడి చేయనుంది. ఈ సినిమాలో సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 న విడుదల కావాల్సిన ఈసినిమా కోవిడ్ -19 తో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై అప్ డేట్ రానుందని సమాచారం.

Also Read:

Vijayashanti Birthday: రాముల‌మ్మ‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపిన సూప‌ర్ స్టార్‌.. స్పందించిన విజ‌య‌శాంతి..

Teaser Talk: ‘పేద‌వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా’.? ఆస‌క్తిక‌రంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజ‌ర్‌..

ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
శ్రీసత్య ఓవర్‌ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు