AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కరోనా కేసులు.. తాజాగా 4,981 పాజిటివ్ కేసులు నమోదు..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ...
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యా్ప్తంగా గడిచిన 24 గంటల్లో 88,622 సాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వీరిలో 4,981 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 6,464 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో పది మంది, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఒక్కరు, కడప జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 38 మంది మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 49,683 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,67,017 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 18,04,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 12,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 283, చిత్తూరు – 854, తూర్పు గోదావరి – 943, గుంటూరు – 267, కడప – 238, కృష్ణా – 372, కర్నూలు – 107, నెల్లూరు – 269, ప్రకాశం – 380, శ్రీకాకుళం – 500, విశాఖపట్నం – 115, విజయనగరం – 60, పశ్చిమ గోదావరి – 593 చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,981 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
AP Eamcet Exams: ఏపీ ఎంసెట్ షెడ్యూల్.. ఆగష్టు 19 నుంచి 25 వరకు.. నోటిఫికేషన్ విడుదల