AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teaser Talk: ‘పేద‌వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా’.? ఆస‌క్తిక‌రంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజ‌ర్‌..

Teaser Talk: ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా...

Teaser Talk: 'పేద‌వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా'.? ఆస‌క్తిక‌రంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజ‌ర్‌..
Reddy Garintlo Rowdyism
Narender Vaitla
|

Updated on: Jun 24, 2021 | 5:16 PM

Share

Teaser Talk: ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ర‌మేష్‌, గోపి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష విశ్వ‌నాథ్‌, ప్రియాంక, పావ‌ని, అంకిత హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన వి.వి. వినాయ‌క్ ఈ సినిమా టీజర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ మాట్లాడుతూ.. టీజ‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని, సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాక్షించారు.

Vv Vinayak

Vv Vinayak

వినాయ‌క్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం ప‌ట్ల హీరో ర‌మ‌ణ్ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంద‌ని చెప్పిన హీరో.. సినిమా టైటిల్‌ను చూసి ఇదేదో ఓ వ‌ర్గానికి సంబంధించిన సినిమా అనో, మ‌రో వ‌ర్గాన్ని కించ ప‌రిచే సినిమా అనో అనుకోకండని తెలిపారు. సినిమా చూస్తే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇక త‌న త‌దుప‌రి చిత్రాల గురించి చెప్పిన ర‌మ‌ణ్‌.. `నేను హీరోగా యాక్ట్ చేస్తున్న రెండో సినిమా పూర్తి కావ‌చ్చింది. మ‌రో రెండు సినిమాలు వ‌చ్చే నెల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయి. అలాగే ఓ పాన్ ఇండియా మూవీని కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది’అని చెప్పుకొచ్చారు. ద‌ర్శ‌కుడు ఎం. ర‌మేస్‌, గోపి మాట్లాడుతూ.. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది` అని చెప్పుకొచ్చారు.

ఇక టీజ‌ర్‌ను గ‌మనిస్తే.. అగ్ర కులానికి చెందిన అమ్మాయి, త‌క్కువ కులానికి చెందిన అబ్బాయి మ‌ధ్య ప్రేమ క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కించ‌నట్లు క‌నిపిస్తోంది. `డ‌బ్బున్న వారు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆద‌ర్శం అంటారు.. అదే పేద‌వారు చేసుకుంటే మాత్రం చంపేస్తారా`? అని హీరో ప‌లికే డైలాగ్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read: Viral Pic: పిక్‌నిక్‌ని ఎంజాయ్ చేస్తున్న పిచ్చుక, ఉడుత.. మంచు వర్షంలో హాయిగా కూర్చుని..

Prabhas Salar: డ‌బుల్ ధ‌మాకా.. ఒక్క‌టి కాదు రెండు. పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?

Seaplane: బైక్ ఇంజన్ తో ‘సీప్లేన్’ తయారు చేసిన అస్సాం వాసి… కల నెరవేరిందని హ్యాపీ !

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!