ఇదేం పని రా బాబు.. విమానంలో మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు..చివరికి

ఈ మధ్య విమానాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో మూత్రవిసర్జన చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

ఇదేం పని రా బాబు.. విమానంలో మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు..చివరికి
Flight
Follow us
Aravind B

|

Updated on: Apr 01, 2023 | 2:56 PM

ఈ మధ్య విమానాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు తాగిన మైకంలో మూత్రవిసర్జన చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గత రెండ్రోజుల క్రితం ఓ ప్రయాణికుడు తప్ప తాగి విమానంలోని ప్రయాణికులు కూర్చునే చోటున వాంతులు చేసుకోవడం, మూత్రవిసర్జన చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వింత ఘటనలన్ని తాగినప్పుడే జరుగుతున్నాయి. అయితే తాజాగా బ్యాంకాక్ నుంచి ముంబయికి ఇండిగో విమానంలో వస్తున్న ఓ ప్రయాణికుడు కూడా తాగిన మైకంలో అందులో పనిచేసే మహిళా సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.

విమానంలో ప్రయాణిస్తుడంగా స్విట్జర్లాండ్ కి చెందిన ఎరిక్ హరాల్డ్ వెస్ట్ బర్గ్ అనే ప్రయాణికుడు మద్యం సేవించాడు. ఆ తర్వాత మహిళా సిబ్బందిని సీ ఫుడ్ ఉందా అని అడగగా ఆమె లేదని బదులిచ్చింది. ఆ తర్వాత ఆమె అతనికి చికెన్ మీల్స్ ఇచ్చింది. అందుకోసం డబ్బులు చెల్లించాలని ఏటీఎమ్ కార్డును అడిగింది. కానీ వెస్ట్ బర్గ్ మాత్రం కార్డును స్వైపింగ్ చేసే క్రమంలో ఆ మహిళను చేయిని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె చేయి విడిపించి పిన్ ఎంటర్ చేయమని అడిగింది. కానీ ఈసారి అతడు హద్దులు దాటాడు. పైకి లేచి ఆమెను అసభ్యకరంగా వేధించాడు. వెంటనే ఆమె అరవడంతో అతను తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.

ఆ తర్వాత ఆమె ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా … విమానం ముంబయిలో దిగగానే ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనపై వెస్ట్ బర్గ్ తరపున న్యాయవాది కోర్టులో వాదించాడు. వెస్ట్ బర్గ్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని… ఇతరుల సహాయం లేకుండా అతని ఏది చేతితో పట్టుకోలేడని తెలిపాడు. విమానంలో అతను మహిళా సిబ్బందిని తాకినప్పడు పెయిమెంట్ కార్డు మిషన్ ను పట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నించాని.. కావాలని ఆమెను ముట్టుకోలేదని చెప్పడం గమనార్హం. గత మూడు నెలల్లో విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడి ఇతనితో కలిపి సుమారు 8 మంది ఇండియాలో అరెస్టయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..