Horse: గుర్రాలు పెంచి లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ఎక్కడంటే
గేదెలు, మేకలు, కోళ్లు లాంటివాటిని పెంచుకుంటూ చాలామంది ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతారు. అయితే పంజాబ్ లోని ఓ రైతు గుర్రాలను పెంచి లక్షల్లో సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన గుర్ తేజ్ సింగ్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
గేదెలు, మేకలు, కోళ్లు లాంటివాటిని పెంచుకుంటూ చాలామంది ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతారు. అయితే పంజాబ్ లోని ఓ రైతు గుర్రాలను పెంచి లక్షల్లో సంపాదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన గుర్ తేజ్ సింగ్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓసారి ఈయన లక్షన్నర రూపాయలతో రెండు గుర్రాలను కొన్నారు. ఆ తర్వాత ఆ గుర్రాలు కొన్ని పిల్లలకు జన్మనిచ్చాయి. అవి కొంచెం పెద్దయ్యాక కొన్నింటిని విక్రయిస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఇతని వద్ద సుమారు 8 గుర్రాలు ఉన్నాయి.
ప్రతిరోజు ఒక్కో గుర్రానికి మేత ఖర్చు సుమారు రూ.200 మాత్రమే అవుతుందని గుర్ తేజ్ చెబుతున్నారు. అయితే గుర్రాలు జీలకర్ర, శెనగలు తింటాయని తెలిపాడు. వీటిని రైతులు కూడా తమ పొలాల్లో పండించుకోవచ్చని పేర్కొన్నారు. పంజాబ్ లో ప్రతినెల గుర్రాల సంత జరుగుతుంది. ఆ సంతలోనే గుర్ తేజ్ తన అశ్వాలను విక్రయిస్తాడు. అక్కడ ఒక్కో గుర్రం దాదాపు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. అలాగే గుర్రాలకు రోగాల ముప్పు కూడా తక్కువేనని గుర్ తేజ్ చెబుతున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా అశ్వాల పెంపకాన్ని నిర్వహిస్తూ మంచి ఆదాయాన్ని విక్రయిస్తున్నాడు గుర్ తేజ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం..