Strange Ice Cream: ప్రపంచంలోనే ఇదో వింత ఐస్ క్రీం.. నిప్పుపెట్టినా కరగదు.. ధర ఎంతో తెలిస్తే షాకే!
Strange Ice Cream: ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిల్లో కొన్నింటి గురించి తెలిసి అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసులా వారు ఐస్‌కు ఫ్యాన్స్ ఉంటారు. అందుకే రోజు రోజుకు ఐస్ క్రీమ్ డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుంది. ఒకప్పుడు సమ్మర్ లో మాత్రమే కనిపించే ఐస్ క్రీంలు..ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు..అందుబాటులోకి వచ్చేసింది. పైగా జనాలను ఆకర్షించడానికి ఐస్ […]

Strange Ice Cream: ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిల్లో కొన్నింటి గురించి తెలిసి అంతా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది.. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసులా వారు ఐస్‌కు ఫ్యాన్స్ ఉంటారు. అందుకే రోజు రోజుకు ఐస్ క్రీమ్ డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుంది. ఒకప్పుడు సమ్మర్ లో మాత్రమే కనిపించే ఐస్ క్రీంలు..ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు..అందుబాటులోకి వచ్చేసింది. పైగా జనాలను ఆకర్షించడానికి ఐస్ క్రీం తయారీలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త ఐస్ క్రీమ్ జనాలను ఆకర్షిస్తుంది..ఇది కేవలం కొత్తది మాత్రమే కాదండోయ్…ప్రపంచంలోనే వింతైన ఐస్ క్రీం.. ఎందుకంటే..దీనికి నిప్పు పెట్టినా కూడా కరగదట..ఇప్పుడు ఇదే కొత్త ఐస్ క్రీం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విచిత్ర ఐస్‌క్రీమ్‌ను 88 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద 1 గంట పాటు గదిలో ఉంచినా కూడా అది కరిగిపోలేదట..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
చైనాకు చెందిన ఈ వింత ఐస్‌క్రీమ్ పేరు చిస్‌క్రీమ్ అని చెబుతున్నారు. ఇక ఈ ఐస్ క్రీం తయారీ, దాని ఆకృతిని నిలుపుకోవడానికి క్యారేజీనన్ గమ్ వాడినట్టుగా ఐస్ క్రీం తయారీదారు వివరించారు. ఐస్‌క్రీమ్‌ను కాల్చడం లేదంటే మంటల్లో వేయడం గానీ, చేసినా కూడా ఇది దాని నాణ్యతను కొల్పోదని చెప్పారు. క్యారేజీనన్ గమ్.. పాల ప్రోటీన్ల స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉంచేందుకు సహాయపడుతుందని వెల్లడించారు. ఇక ఈ వింత ఐస్ క్రీం ధర కేవలం 8.20 యూరోలు అంటే దాదాపు 656 రూపాయలు. నిప్పుపెట్టినా కూడా కరగని ఐస్ క్రీం తినాలంటే..మీ జేబులో ఖచ్చింతంగా ఓ వెయ్యి రూపాయలు ఉండాల్సిందే..




ఈ వింత ఐస్‌క్రీం గురించి తెలుసుకున్న ప్రజలు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. చైనాకు చెందిన ఈ కొత్త ఐస్‌క్రీమ్‌లో నిప్పుపెట్టినా కూడా కరగదంటే ఎలా మరీ.. అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మంటల్లో వేసినా కూడా కరగకపోతే, ఈ ఐస్ క్రిం తిన్నాక కడుపులోనైనా కరిగిపోతుందా..? లేదా అంటై ఫన్నీ క్వాశ్చన్స్ వేస్తున్నారు నెటిజన్లు. ఏదీ ఏమైనా ఈ వింత ఐస్ క్రీం మాత్రం నెట్టింట వేడి పుట్టిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి