బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!
చాలామంది ఎక్కడికైనా వెళ్లాలంటే ఆఖరి నిమిషం వరకూ రెడీ అవుతూనే ఉంటారు. చివరికి సమయం అయిపోయి హడావిడిగా ఎదురుగా కనిపించిన చెప్పులో, షూలో తగిలించుకొని పరుగెడతారు.
చాలామంది ఎక్కడికైనా వెళ్లాలంటే ఆఖరి నిమిషం వరకూ రెడీ అవుతూనే ఉంటారు. చివరికి సమయం అయిపోయి హడావిడిగా ఎదురుగా కనిపించిన చెప్పులో, షూలో తగిలించుకొని పరుగెడతారు. ఇక తల్లులు పిల్లల్ని ఉదయాన్నే స్కూలుకి పంపే హడావిడిలో ఒక్కోసారి స్కూల్ షూస్ చెక్ చేయకుండా అలాగే వేసేస్తుంటారు. ఒక్కోసారి ఇవే మనల్ని ప్రమాదాల బారిన పడేస్తాయి. అలా హడావిడిగా వేసుకోబోయిన షూలోంచి ప్రమాదకరమైన పాము బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూ లోపల పామును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో ఈ చిన్న క్లిప్‌ను షేర్ చేశారు. వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడే పాములు ప్రత్యక్షమవుతుంటాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో షూలో దాగివున్న పామును పట్టుకోవడానికి ఒక మహిళ షూ లోపల కర్రతో కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bonalu Special Song 2022: బోనాల సంబురం.. టీవీ 9 ప్రత్యేక పాట..
Godavari: గోదావరి ఉగ్రరూపం…భద్రాచలం ‘హై అలర్ట్’.. లైవ్ వీడియో
News Watch: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు..ఇప్పుడు మనం ఏం చేయాలి ??