Viral Photo: ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు మీరు సెల్యూట్ చేయకుండా ఉండగలరా..?

ఈ రైతు ఐడియాను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి. మూగ జీవాల బాధను అర్థం చేసుకుని.. వాటికి ఆ పెయిన్ లేకుండా చేయడానికి ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చాడు ఈ యువరైతు.

Viral Photo: ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు మీరు సెల్యూట్ చేయకుండా ఉండగలరా..?
Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 14, 2022 | 7:51 PM

Trending Photo: అన్నం పెట్టే అన్నదాతల్లో చాలామంది  చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలని కోరుకుంటారు. చెట్టు, చేమ, పురుగు, పుట్ట, మన్ను గురించి కూడా ఆలోచిస్తారు. రైతులు.. తమ ఇంట్లోని ఎడ్లు, గేదెలు… ఇతర జీవులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటి బాగోగులు కూడా చూసుకుంటారు. ఎండా, వానలకు ఇబ్బంది పడకుండా వాటికి ప్రత్యేకంగా షెడ్లు వేస్తారు. గ్రామాల్లో వీటినే గొడ్ల సావిళ్లు లేదా కొట్టాలు అంటారు. రాత్రుళ్లు వాటికి దోమలు కుట్టకుండా ఫ్యాన్స్ కూడా పెడతారు కొందరు. తాజాగా ఓ రైతు తన ఎద్దులపై భారం పడకుండా చేసిన ఓ ఇన్నోవేషన్ ప్రజల మనసులను గెలుచుకుంటుంది. లోడ్ బండ్లను లాగేటప్పుడు ఎడ్లపై బోలెడంత భారం పడుతుంది. కొన్ని సార్లు స్థాయికి మించిన బరువు వేసినప్పటికీ.. ఆ బాధను పంటి కింద అనుచుకుంటూ తన యజమాని ఆజ్ఞలను పాటిస్తాయి. వాటి పెయిన్ అర్థం చేసుకున్న రైతు సరికొత్త ఆలోచనతో ముందకు వచ్చాడు. ఎడ్ల వెన్నుపై పడే భారం నుంచి ఉపశమనం కలిగే విధంగా ముందు భాగంలో చక్రాన్ని అమర్చాడు. ఇలా చేయడం వల్ల ఎడ్లపై చాలా భారం తగ్గుతుంది. అవి ఇబ్బంది లేకుండా ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) “విప్పర్ వాడ” గ్రామానికి చెందిన ఒక యువరైతు ఈ కొత్త ఉపాయంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. పక్కన మనిషి సఫర్ అవుతుంటేనే మనకెందులే అని అనుకునే జనాలు ఉన్న ఈ సమాజంలో.. ఇలా మూగజీవాల గురించి ఆలోచించిన రైతును అభినందించకుండా మీరు ఉండగలరా..?. అందుకే ఓ రైతన్న నీకు సెల్యూట్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి