Viral Video: సోన్‌ పాపిడిని ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే దడుసుకుంటారు

ప్రజల ప్రాణాలు పోతున్నా కొందరు కాసుల కక్కుర్తి కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. ఇక మరికొందరైతే అత్యంత దారుణమైన పరిస్థితుల నడుమ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే దడుసుకోవాల్సిందే..

Viral Video: సోన్‌ పాపిడిని ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే దడుసుకుంటారు
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2024 | 8:11 PM

ప్రస్తుతం జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. రోజూ వార్తల్లో వస్తున్న షాకింగ్‌ ఇన్సిడెంట్స్‌ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. బయట రెస్టారెంట్స్‌లో లభించే ఫుడ్ తిని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిబట్టే బయటి ఫుడ్‌ ఎంత తక్కువ నాణ్యతతో తయారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కాసుల కక్కుర్తి కోసం కొందరు కుళ్లిపోయిన వస్తువులను ఉపయోగించి వంటలు చేసేస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మరోసారి చిరు తిళ్లు తినాలంటేనే భయపడుతారు. వివరాల్లోకి వెళితే. కొందరు వ్యక్తులు సోన్‌ పాపిడిని తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగానే పిండిని నెయ్యిలో ఉడికించారు. ఆ తర్వాత చక్కెర పాకం వేశారు. ఆ మిశ్నమాన్ని తీగలాగా తయారు చేశారు. అయితే ఆ మిశ్రాన్ని ఏమాత్రం పరిశుభ్రంగా లేని గోడపై వేసి సాగతీశాడు. ఇక చివరిలో చాలా దారుణం.

ఏమాత్రం గ్లౌజ్‌లు కూడా ఉపయోగించకుండా సోన్‌ పాపిడి పిండిని చేతులతోనే మెత్తగా చేశారు. సోన్‌ పాపిడి కోసం సిద్ధం చేసిన పిండిని చదునుగా చేసేందుకు ఒక మూతను బోర్లించి చెప్పులతో తొక్కారు. ఇంతటి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో సోన్‌ పాపిడిని తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఎంతో ఇష్టపడి లొట్టలేసుకొని తినే ఫుడ్‌ను ఇంత దారుణంగా తయారు చేస్తారా.? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్లకు పైగా నెటిజన్లు చూడగా.. వేలల్లో లైక్‌లు.. కామెంట్లు వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!