Viral Video: బుసలు కొడుతూ వచ్చి.. ఈ పాము చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..
సోషల్ మీడియాలో అనేక వీడియోలు, న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఏ మాత్రం ఫన్నీగా, వెరైటీగా అనిపించినా నెట్టింట జోరుగా షికారు చేస్తాయి. అప్పటికప్పుడు జరిగిన కొన్ని ఆశ్చర్యకరమై సంఘటనలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా కూడా జరుగుతాయా? అని ఆ వీడియో చూశాకే అర్థమవుతాయి. ఇక నెట్టింట ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్..
సోషల్ మీడియాలో అనేక వీడియోలు, న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఏ మాత్రం ఫన్నీగా, వెరైటీగా అనిపించినా నెట్టింట జోరుగా షికారు చేస్తాయి. అప్పటికప్పుడు జరిగిన కొన్ని ఆశ్చర్యకరమై సంఘటనలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా కూడా జరుగుతాయా? అని ఆ వీడియో చూశాకే అర్థమవుతాయి. ఇక నెట్టింట ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. పాము ఎటాక్ చేసినా.. పాము ఎటాక్‌కి గురైనా తక్షణమే వీడియోలు ప్రత్యక్షం అవుతాయి. తాజాగా ఇప్పుడు పాముకు సంబంధించిన ఓ వీడియోనే వైరల్‌గా మారింది. ఇది చూశారంటే ఖచ్చితంగా మీకు నవ్వు స్తుంది.
పాము చాలా విష పూరితమైన జంతువు. ఒక్క కాటు గట్టిగా వేసిందంటే.. పరలోకాలకు గేట్లు తీసినట్లే. ప్రస్తుతం వర్షా కాలం కాబట్టి.. ఈ సీజన్‌లో పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మన పక్కనే తిరుగుతూ ఉంటాయి. ఇలానే ఓ ఇంటి ముందుకు వేగంగా.. బుసలు కొడుతూ వచ్చింది పాము. ఆ పామును చూసిన జనం భయ పడకుండా.. పామును తరిమి కొడుతున్నారు. అయినా ఆ పాము బెదర కుండా.. అదరకుండా ఇంటి ముందుకు వస్తుంది. అప్పుడు ఇంటి సభ్యులు పాముపై చెప్పు విసిరారు.
అంతే అదేదో చాక్లెట్ అన్నట్టు ఎంతో సంబర పడిందో లేక తినే వస్తువు అనుకుంటే కానీ.. లటుక్కున నోట్లో చెప్పును పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా.. పెద్ద ఎత్తున పడగ విప్పి.. వేగంగా వెళ్లింది. కానీ ఆ చెప్పును మాత్రం అస్సలు వదిలి పెట్టకుండా.. తనతో పాటు తీసుకెళ్లింది. ఈ సంఘటన అంతా అక్కడున్న వారు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో మీరు కూడా చూసి నవ్వుకోండి.
चप्पल चोर साँप 🤣 pic.twitter.com/41VezsdAda
— Dinesh Kumar (@DineshKumarLive) August 11, 2024