Viral Video: వార్నీ ఇదేం పాము.. మనిషి టచ్ చేయగానే చనిపోయింది..! ఏంటీ నమ్మలేకపోతున్నారా..? అయితే, మీరే చూడండి..
ఈ వీడియో పబ్లిటీ ఖాతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయబడింది. షేర్ చేసిన అతి తక్కువ సమయంలో ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతోంది. అయితే, ఇక్కడ కనిపించే పాము పెంపుడు పాముగా తెలిసింది. వీడియో ఆరంభంలో పాము నేలపై తలను కాస్త పైకి ఎత్తి కనిపిస్తుంది. అంతలో యజమాని దాని దగ్గరకు వస్తాడు..వేలితో నెమ్మదిగా ఆ పామును తట్టాడు.. అంతే. పాపం.. అమాంతంగా అలానే నేలకు ఒరిగిపోయింది.. ఇంతకీ అక్కడ జరిగిందేంటో వీడియో చూడాల్సిందే..

నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది మిలియన్ల మందిని ఆకర్షించే వైరల్ వీడియోలకు అద్భుతమైన ప్లాట్‌ఫామ్. ఇక్కడ అనేక రకాలైన వైరల్ వీడియోలు, ఫోటోలు, అరుదైన సంఘటనలు కనిపిస్తాయి. జంతువులు, పక్షులు, పాములు ఇలా అనేక వీడియోలు షేర్ అవుతుంటాయి. తాజాగా ఓ పాము చేస్తున్న యాక్టింగ్ చూసిన నెటిజన్లు ఔరా అంటూ ముక్కున వెలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జిత్తుల మారిన పాము వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతూ నెట్టింగ తెగ హల్‌చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పాము చేస్తున్న నాటకం కనిపిస్తుంది. అయితే, ఇక్కడ కనిపించే పాము పెంపుడు పాముగా తెలిసింది. ఆ పాము తన యజమానితో కలిసి భలేగా ఆడుకుంటోంది. నేలపై ఉన్న ఆ పాము.. తలను కాస్త పైకి ఎత్తి ఉంటుంది.. అంతలో యజమాని దాని దగ్గరకు వస్తాడు..వేలితో నెమ్మదిగా ఆ పామును తట్టాడు.. అంతే..అది ఉన్నట్టుండి నేలపై ఓ పక్కకు ఒరిగిపోయింది.. చూస్తే మాత్రం.. అయ్యో పాపం ఆ పాము అలా చచ్చిపోయిందే..! అనుకుంటారు.. కానీ, అదంతా నిజం కాదు.. ఆ పాము అలా యాక్ట్ చేస్తోంది..ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియో పబ్లిటీ ఖాతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయబడింది. షేర్ చేసిన అతి తక్కువ సమయంలో ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతోంది. వీడియో షేర్ చేసిన యజమాని.. తన పాము చనిపోయినట్టుగా యాక్ట్ చేయటం నేర్చుకుంది.. భలేగా యాక్ట్ చేస్తుంది అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. ఇక వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. కొందరు అది దాని స్వభావం అంటున్నారు. వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఈ పాము అలా చేస్తుందని కొందరు, దానికి కావాల్సిన ఎర కోసం ఈ పాము ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?
ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్
ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




