Andhra Pradesh : కవల ఆవు దూడలకు మొదటి పుట్టిన రోజు వేడుక.. ఊరంతా సందడి..
కవల ఆవుదూడల పుట్టినరోజు వేడుక సందర్భంగా గ్రామస్తులందరికీ ఆహ్వానం పంపి, భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశువులను కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు... కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కవల ఆవు దూడల పుట్టినరోజు సందర్భంగా

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కవల ఆవు దూడలకు మొదటి పుట్టిన రోజు వేడుక అట్టహాసంగా నిర్వహించారు. బంధువులను పిలిచి కేక్ కట్ చేసి విందు భోజనాలు ఏర్పాటు చేసి పండగ చేసుకున్నారు కవల ఆవు దూడలను పెంచుకుంటున్న కుటుంబ సభ్యులు. ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల పూడి గ్రామంలో కవల ఆవు దూడలు రామలక్ష్మణుల జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10 కేజీల కేక్ కట్ చేసి, వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. రామలక్ష్మణులు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని గ్రామస్తులంతా రామలక్ష్మణులని దీవించారు.
చిన్న శంకర్ల పూడి గ్రామానికి చెందిన మిరియాల వెంకటేష్ అనే రైతు కి చెందిన ఆవు ఏడాది కిందట ఒకే ఈతలో రెండు గిత్తలకు జన్మనిచ్చింది…ఎంతో అపురూపంగా ఉన్న ఆ కవల గిత్తలను చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు రావడంతో, ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. కవల గిత్తలకు రామలక్ష్మణులు అని నామకరణం చేసి వాటిని సొంత బిడ్డల్లా పెంచుకుంటున్నారు. అవి జన్మించి నేటికీ ఏడాది కావడంతో గ్రామస్తులు అందరి సమక్షంలో వాటి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని వెంకటేష్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
కవల ఆవుదూడల పుట్టినరోజు వేడుక సందర్భంగా గ్రామస్తులందరికీ ఆహ్వానం పంపి, భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశువులను కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులను గ్రామస్తులు అభినందించారు… కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కవల ఆవు దూడల పుట్టినరోజు సందర్భంగా విందు భోజనాలు చేసి వెళ్లారు గ్రామస్తులు బంధువులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




