Watch: పడగవిప్పిన నాగుపాము బుసకొడుతూ ధమ్మీకి.. తోక ముడిచిన పెద్దపులి పరుగో పరుగు.. వీడియో చూస్తే అవాక్కే

మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. పెద్దపులికి భలే ధమ్కీ ఇచ్చిందిరా బాబోయ్‌ అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.. మరికొందరు మాత్రం.. పాముతో పెట్టుకుంటే మటాషే అంటూ అంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Watch: పడగవిప్పిన నాగుపాము బుసకొడుతూ ధమ్మీకి.. తోక ముడిచిన పెద్దపులి పరుగో పరుగు.. వీడియో చూస్తే అవాక్కే
Tiger And Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2024 | 1:25 PM

పెద్ద పులి అడవికి రాజు.. దాని దారికి అడ్డుగా వచ్చిన ఏ జీవి బతికి బట్టకట్టలేదని చెప్పాలి. అడవిలో పులి తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. పెద్దపులి అడుగు జాడలు కనిపించినా చాలు.. అక్కడ ఏ ఒక్క జంతువు కూడా నిలబడలేదు. భయంతో పారిపోవాల్సిందే. పులికి బలం మాత్రమే కాదు..చురుకుదనం, వేగంగా పరిగెత్తగల సామర్థ్యం కలిగిన క్రూర జంతువు అంటారు. అయితే, అలాంటి పెద్ద పులి కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న ప్రాణులకు భయపడి తోక ముడిచిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నేలపై పాకుతున్న నాగుపామును చూసిన పెద్దపులి ఏం చేసిందో ఈ వీడియోలో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..పూర్తి వివరాల్లోకి వెళితే…

అడవిలో ఒక పెద్దపులి దాహం తీర్చుకునేందుకు నీళ్లను తాగేందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతలోనే ఆ నీటిలో ఒక నాగుపాము పాకుతూ వెళ్తుంది. నీటి కోసం వచ్చిన ఆ పెద్ద పులికన్నుకాస్త పాము మీద పడింది. పాము దగ్గరకు వెళ్లింది. ఇంతలోపాము.. ఒక్కసారిగా నా దగ్గరకు వస్తావా.. అన్నట్టుగా కోపంతో పడగ విప్పి పులి వైపుకు తిరుగుతుంది. అంతే.. పెద్దపులి హడిలిపోయింది. నాకెందుకు వచ్చిన తంటా అనుకుందో ఏమోగానీ, ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి మెళ్లిగా వెనక్కు జరిగిపోతుంది. పాము ఏమాత్రం తగ్గకుండా.. పులి వైపుకు పాక్కుంటా ముందుకు వెళ్తుంది. పాపం.. పెద్దపులి మాత్రం.. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెటిజన్లు తెగ ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. పెద్దపులికి భలే ధమ్కీ ఇచ్చిందిరా బాబోయ్‌ అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.. మరికొందరు మాత్రం.. పాముతో పెట్టుకుంటే మటాషే అంటూ అంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..