AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శభాష్‌ అక్కలు.. తాగుబోతుల తాట తీశారు..! వీడియో చూశారంటే సెల్యూట్‌ చేయాల్సిందే..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది వీడియోని చూశారు.. ఈ వీడియోపై స్పందించిన పలువురు ఈ మహిళలు చేస్తున్న పనిని అభినందించారు. అందుకే మహిళలు మాత్రమే ప్రపంచాన్ని చక్కదిద్దగలరని ఒకరు వ్యాఖ్యనించారు. సిస్టమ్ తన పనిని చేయనప్పుడు, సాధారణ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటూ మరొకరు పేర్కొన్నారు.

శభాష్‌ అక్కలు.. తాగుబోతుల తాట తీశారు..! వీడియో చూశారంటే సెల్యూట్‌ చేయాల్సిందే..
Women Beat Up Me
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2024 | 1:04 PM

Share

మందుబాబుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అయిదంటే చాలు తాగుబోతుల వీరంగంతో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తుంది. యద్ధేచ్ఛగా మందు, విందులతో నడి రోడ్లపైనే పార్టీలు చేసుకుంటూ వచ్చే పోయే వారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. సైలెంట్‌ వెళ్తున్న వారిని సైతం రెచ్చిగొట్టి వాగ్వాదం, గొడవ, దాడి చేయటం వంటివి సర్వసాధారణమైంది. తాగుబోతులతో వికృత చేష్టలకు ప్రజలు విసుగెత్తిపోతుంటారు. అయితే, సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది ఒక చోట.. కానీ, అక్కడి ప్రజలు ఇదంతా భరించేందుకు సిద్ధంగా లేరు. తాగుబోతుల బెడదతో విసిగి వేసారిపోయిన స్థానిక మహిళలంతా ఏకమయ్యారు.. ఈ తాగుబోతులు మళ్లీ పరిసరాల్లోకి కూడా రాకుండా గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. మహిళా లోకం తలచుకుంటే.. ఏం చేయగలరో నిరూపించారు. దాంతో తోక ముడిచిన మందుబాబులు బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ముంబయిలోని ఓ ప్రాంతంలో స్థానిక మహిళలు రోడ్డెక్కారు. నడిరోడ్డుపై మందేస్తున్న తాగుబోతులను చీపుర్లు తిరగేసి చితక్కొట్టారు. నిత్యం రోడ్లపై గుమిగూడి మద్యం సేవిస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న తాగుబోతులతో విసిగి వేసారిన మహిళలు ఎవరి సాయం లేకుండా తమ సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు తోడుగా మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది. ప్రజలు, సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఇలాంటి మహిళలను పలువురు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ముంబైలోని కండివాలిలోని లాల్జీ పడాలో జరిగినట్టుగా తెలిసింది. రోడ్లపైనే మందేస్తూ మహిళలు, చిన్నారులు, వృద్ధులను సైతం బహిరంగ వేధింపులకు గురిచేస్తున్న అకతాయిల చేష్టలతో విసుగు చెందిన ఈ మహిళలు ఇంకేప్పుడు బహిరంగంగా మద్యం సేవించకుండా గట్టిగానే భయం పుట్టించారు. అంతేకాదు తాగి ఇష్టం వచ్చినట్టుగా అరుస్తున్న వారికి చీపురుతో బడితే పూజ చేశారు. వీడియోలో, చేతిలో చీపుర్లు పట్టుకుని తాగుబోతుల వైపు వెళ్తున్న మహిళల దృశ్యం చూసిన నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపించారు.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది వీడియోని చూశారు.. ఈ వీడియోపై స్పందించిన పలువురు ఈ మహిళలు చేస్తున్న పనిని అభినందించారు. అందుకే మహిళలు మాత్రమే ప్రపంచాన్ని చక్కదిద్దగలరని ఒకరు వ్యాఖ్యనించారు. సిస్టమ్ తన పనిని చేయనప్పుడు, సాధారణ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటూ మరొకరు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఈ పోస్ట్‌ను ముంబై పోలీసులను ట్యాగ్ చేసారు. ఇలాంటి తాగుబోతుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..