రోబో బేబీలా ? ఎంత క్యూట్ గా ఉన్నాయో ?

‘ బేబీ అవతార్ ‘ అనే మూవీని ఎవరైనా తీస్తే.. అందులో రోబో బేబీలు కనిపించడం ఖాయం.. అచ్ఛు మానవ శిశువుల్లానే.. ముచ్చట గొలిపే ఈ రోబో పసికందులు కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇటీవల స్పెయిన్ లోని బిల్ బావోలో జరిగిన ట్రేడ్ ఫెయిర్ లో ‘ రీబోర్న్ బేబీస్ ‘ పేరిట కృత్రిమమైన బేబీ డాల్స్ ను ప్రదర్శించారు. ‘ బేబీ క్లాన్ ‘ అనే స్పానిష్ కంపెనీ వీటిని రూపొందించింది. వీటిలో సిలికాన్ […]

రోబో బేబీలా ? ఎంత క్యూట్ గా ఉన్నాయో ?
Follow us

|

Updated on: Nov 12, 2019 | 3:03 PM

‘ బేబీ అవతార్ ‘ అనే మూవీని ఎవరైనా తీస్తే.. అందులో రోబో బేబీలు కనిపించడం ఖాయం.. అచ్ఛు మానవ శిశువుల్లానే.. ముచ్చట గొలిపే ఈ రోబో పసికందులు కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇటీవల స్పెయిన్ లోని బిల్ బావోలో జరిగిన ట్రేడ్ ఫెయిర్ లో ‘ రీబోర్న్ బేబీస్ ‘ పేరిట కృత్రిమమైన బేబీ డాల్స్ ను ప్రదర్శించారు. ‘ బేబీ క్లాన్ ‘ అనే స్పానిష్ కంపెనీ వీటిని రూపొందించింది. వీటిలో సిలికాన్ తో తయారైన రోబో బేబీల ధర 600 యూరోలు (670 డాలర్లు) ఉండగా.. మోటార్స్, సెన్సర్స్ వంటివాటితో కూడిన వాటి ధర సుమారు 5 వేల యూరోలు పలుకుతోంది. ఖరీదైన ఇవి ఊపిరి పీల్చుకుంటున్నట్టు, పాలసీసా నోటిలో పెడితే పాలు తాగుతున్నట్టు కనిపిస్తాయి. పిల్లలు లేని దంపతులు వీటిపట్ల తెగ ఆసక్తి చూపుతున్నారు. అన్నట్టు బేబీ క్లాన్ సంస్థ బేబీ చింపాంజీ లాంటి రోబోలను కూడా రూపొందిస్తోంది.