మరీ అంత స్పీడా… గాల్లోకి ఎగిరి మొదటి అంతస్తులోకి దూసుకెళ్లిన కారు!

వేగంగా వెళుతున్న పోర్షే కారు గాలిలోకి పల్టీకొట్టి భవనం యొక్క మొదటి అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. నిన్న ఉదయం 6.30 గంటలకు న్యూజెర్సీలో బ్రాడెన్ డిమార్టిన్ (22) కారు నడుపుతున్నాడు. న్యూజెర్సీలో  డివైడర్ ను ఢీకొన్న సంఘటనలో కారు అదుపుతప్పి భవనం మొదటి అంతస్తులోకి వెళ్లడంతో బ్రాడెన్ డిమార్టిన్ మరియు తన స్నేహితుడు డేనియల్ ఫోలే (23) ను అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం సమయానికి ఆ గదిలో ఎవరూ లేరు. కారులో చిక్కుకున్న […]

  • Updated On - 12:07 pm, Tue, 12 November 19 Edited By:
మరీ అంత స్పీడా... గాల్లోకి ఎగిరి మొదటి అంతస్తులోకి దూసుకెళ్లిన కారు!

వేగంగా వెళుతున్న పోర్షే కారు గాలిలోకి పల్టీకొట్టి భవనం యొక్క మొదటి అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. నిన్న ఉదయం 6.30 గంటలకు న్యూజెర్సీలో బ్రాడెన్ డిమార్టిన్ (22) కారు నడుపుతున్నాడు. న్యూజెర్సీలో  డివైడర్ ను ఢీకొన్న సంఘటనలో కారు అదుపుతప్పి భవనం మొదటి అంతస్తులోకి వెళ్లడంతో బ్రాడెన్ డిమార్టిన్ మరియు తన స్నేహితుడు డేనియల్ ఫోలే (23) ను అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం సమయానికి ఆ గదిలో ఎవరూ లేరు. కారులో చిక్కుకున్న వారి శరీరాలను బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత క్రేన్ సాయంతో కారును కిందికి దించారు.