రూపాయికే కిలో చేపలు.. ఎక్కడంటే!

వ్యాపారం అభివృద్ధి చెందటం కోసం వ్యాపారులు కొత్త కొత్త పంథాలు అనుసరిస్తుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి ఇదే వ్యూహాన్ని ఎంచుకుని విపరీతమైన లాభాలు గడిస్తున్నాడు. శివగంగ జిల్లా కరైకుడికి చెందిన ఓ చేపల వ్యాపారి కొత్తగా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా తన దగ్గరికి వచ్చిన 100 మంది కస్టమర్లకు కేవలం రూ. 1కే కిలో చేపలు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇక ఈ ఆఫర్ గురించి ప్రకటించాడో లేదో.. చేపలు […]

  • Updated On - 10:55 am, Tue, 12 November 19 Edited By:
రూపాయికే కిలో చేపలు.. ఎక్కడంటే!

వ్యాపారం అభివృద్ధి చెందటం కోసం వ్యాపారులు కొత్త కొత్త పంథాలు అనుసరిస్తుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి ఇదే వ్యూహాన్ని ఎంచుకుని విపరీతమైన లాభాలు గడిస్తున్నాడు. శివగంగ జిల్లా కరైకుడికి చెందిన ఓ చేపల వ్యాపారి కొత్తగా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

మొదటిగా తన దగ్గరికి వచ్చిన 100 మంది కస్టమర్లకు కేవలం రూ. 1కే కిలో చేపలు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇక ఈ ఆఫర్ గురించి ప్రకటించాడో లేదో.. చేపలు కొనడానికి ఉదయం 6 గంటల నుంచే జనం ఎగబడ్డారు. తొలి 100 మందికి చేపలు ఇచ్చిన ఆ వ్యాపారి తన వ్యాపారానికి విస్తృతమైన ప్రచారం దక్కిందని సంతోషపడుతున్నాడు. అంతేకాకుండా రూపాయికే ఇడ్లీలు అమ్మిన బామ్మ తనకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చాడు.