పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళపై జగన్ సెటైర్.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

సాధారణంగా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి కన్నెత్తి చూడని, పల్లెత్తి మాట్లాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి యధాలాపంగా చేసిన ఈ కామెంట్లిపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది అని కొందరంటుంటే.. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఇలాంటివి పడాల్సిందేనని మరికొందరు అంటున్నారు. ఇంతకీ జగన్ చేసిన కామెంట్లేమిటి ? ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అంశమే […]

పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళపై జగన్ సెటైర్.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!
Follow us

|

Updated on: Nov 12, 2019 | 9:05 AM

సాధారణంగా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి కన్నెత్తి చూడని, పల్లెత్తి మాట్లాడని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి యధాలాపంగా చేసిన ఈ కామెంట్లిపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది అని కొందరంటుంటే.. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఇలాంటివి పడాల్సిందేనని మరికొందరు అంటున్నారు. ఇంతకీ జగన్ చేసిన కామెంట్లేమిటి ?

ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కంపల్సరీ చేసింది జగన్ ప్రభుత్వం. అయితే.. ప్రభుత్వ పాఠశాలలు అందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా లేవని అధికారులు చెప్పడంతో దాన్ని తొలుత 6వ తరగతి దాకా కుదించారు ముఖ్యమంత్రి. అయితే ఈ నిర్ణయంతో తాముు వెనక్కి తగ్గుతున్నట్లు భావించరాదని సీఎం సోమవారం విద్యాశాఖ సమీక్షలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం 6వ తరగతి వరకు.. ఆ తర్వాత ఒక్కో ఏడు ఒక్కో సంవత్సరం ఇంగ్లీష్ మీడియం పెంచుకుంటూ వెళతామని క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేయడంపై విపక్షాలు చేసిన కామెంట్లను కొందరు గుర్తు చేయడంతో జగన్ పొలిటికల్ సెటైర్స్ వేశారని సమాచారం. ఈ సెటైర్స్ కేవలం పవన్ కల్యాణ్‌పైనే కాకుండా.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడులపై కూడా వేశారు. కానీ.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై జగన్ యధాలాపంగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.

‘‘ ఉదాహరణకు పవన్ కల్యాణ్ వున్నారు.. ఆయనకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి.. నలుగురో అయిదుగురో పిల్లలుండి వుంటారు.. మరి వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో కాకుండా.. తెలుగు మీడియంలో చదువుతున్నారా ?’’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వెంకయ్య, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. ఏపీలోని పేద పిల్లలేమో తెలుగులో చదువుకోవాలా ? ఇదేం రాజకీయం అని జగన్ కాస్త వ్యంగ్యంగా.. మరికాస్త ఘాటుగా సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు జగన్ సమీక్షలో నవ్వులు పూయించగా.. సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలకు దారితీశాయి.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు