Viral Video: నిజమైన టామ్ అండ్ జెర్రీ ఫైట్‌‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు చూసి కడుపుబ్బా నవ్వుకోండి..!

Viral Video: పిల్లులు, ఎలుకల మధ్య శత్రుత్వం.. ప్రకృతి సిద్ధం. ఒకదానికొకటి అస్సలు పడదు. పిల్లికి ఎలుక ఆహారం. పొరపాటున ఎలుక గనుక..

Viral Video: నిజమైన టామ్ అండ్ జెర్రీ ఫైట్‌‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు చూసి కడుపుబ్బా నవ్వుకోండి..!
Cat And Rat
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 21, 2022 | 7:24 AM

Viral Video: పిల్లులు, ఎలుకల మధ్య శత్రుత్వం.. ప్రకృతి సిద్ధం. ఒకదానికొకటి అస్సలు పడదు. పిల్లికి ఎలుక ఆహారం. పొరపాటున ఎలుక గనుక పిల్లికి చిక్కిందో అదే దానికి చివరి రోజు అవుతుంది. అయితే, కొన్ని పెంపుడు పిల్లులు, ఎలుకలు కలిసి మెలిసి ఉంటాయి. అదే వేరే విషయం అనుకోండి. సహజంగా పెరిగిన పిల్లి, ఎలుక కు మధ్య శత్రుత్వం ఉంటుంది. పిల్లి అలజడి కనిపిస్తే చాలు.. ఎలుకలు పరుగులు తీస్తాయి. వాటి మధ్య తరచూ దోబూచులాట జరుగుతుంది. పిల్లి, ఎలుక పోరుపై ఎన్నో టీవీ షోలు నడుస్తున్నాయి. ప్రముఖంగా టామ్ అండ్ జెర్రీ కర్టూన్ షో గురించి చెప్పుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఓ పిల్లి, ఎలుక మధ్య జరిగిన ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పిల్లిని చూసి.. ఎలుక బిక్కు బిక్కుమంటూ దాక్కుని ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక ఇంట్లో మూలన కర్ర ఉంది. ఆ కర్రపైన ఎలుక్క నక్కి ఉండగా.. ఆ ఎలుక కోసం కింద పిల్లి గుటకలు వేస్తూ కాచుకుని కూర్చుంది. దాంతో పిల్లిని చూసి ఎలుక బిక్కు బిక్కుమంటూ అలాగే ఉండిపోయింది. ఎలుక ఎప్పుడు కిందకు దిగుతుందా? అని పిల్లి ఎదురు చూస్తుంటే.. నేను రానుపో అంటూ భయంతో పైని ఉండిపోయింది ఎలుక. ఈ ఫన్నీ సీన్‌ను ఇంట్లోని యజమాని తన కెమెరాలో రికార్డ్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. పిల్లి, ఎలుక తీరును చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇది నిజమైన టామ్ అండ్ జెర్రీ పోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ పన్నీ సన్నివేశాన్ని చూసి మీరూ ఎంజాయ్ చేయండి.

Also read:

Uric Acid Issues: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!

Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!