AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology: ఈ పిల్లి మెట్లు ఎక్కుతుందా? దిగుతుందా? మీ సమాధానం మీరు ఆశావాదో.. నిరాశావాదో చెప్పేస్తుంది..

వ్యక్తిత్వం, భావాలు, వైఖరులు ఒక వ్యక్తి నుంచి మరొకరికి భిన్నంగా ఉంటాయి. ఈ వ్యక్తిత్వ రహస్యాన్ని తెలుసుకోవడానికి పర్సనాలిటీ టెస్ట్‌ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్‌ పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ ఫొటోలో ఓ పిల్లి మెట్లు..

Psychology: ఈ పిల్లి మెట్లు ఎక్కుతుందా? దిగుతుందా? మీ సమాధానం మీరు ఆశావాదో.. నిరాశావాదో చెప్పేస్తుంది..
This Cat Will Reveal Your Personality
Srilakshmi C
|

Updated on: Nov 09, 2025 | 2:38 PM

Share

ప్రతి ఒక్కరి కోరికలు, ఆకాంక్షలు భిన్నంగా ఉన్నట్లే వారి వ్యక్తిత్వాలు కూడా భిన్నంగా ఉంటాయి. కొందరు అంతర్ముఖులు, మరికొందరు బహిర్ముఖులుగా ఉంటారు. కొంతమంది అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతారు.. మరికొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అందువల్ల, వ్యక్తిత్వం, భావాలు, వైఖరులు ఒక వ్యక్తి నుంచి మరొకరికి భిన్నంగా ఉంటాయి. ఈ వ్యక్తిత్వ రహస్యాన్ని తెలుసుకోవడానికి పర్సనాలిటీ టెస్ట్‌ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్‌ పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ ఫొటోలో ఓ పిల్లి మెట్లు ఎక్కుతున్నట్లు, దిగుతున్నట్లు ఒకేసారి భ్రాంతిని కలిగిస్తాయి. అయితే మీరు ఈ ఫొటోలో పిల్లి మెట్లు ఎక్కుతుందా? లేదా దిగుతుందా? అనే విషయం చెబితే.. మీరెలాంటి వారో మేం చెప్పేస్తాం..

పిల్లి మెట్లు ఎక్కినట్లు భావిస్తే..

ఈ చిత్రంలో పిల్లి మెట్లు ఎక్కడం మీరు చూసినట్లయితే.. మీరు జీవితం పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉన్నారని అర్థం. అయితే కొంత నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జీవితంలోని సూక్ష్మమైన విషయాలపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఈ అలవాటె కొన్నిసార్లు మీరు నిర్ణయాలు పూర్తిగా ఆలోచించకుండా తొందరపాటుతో వ్యవహరించేలా చేస్తుంది. అంతేకాకుండా మీరు వ్యక్తులలో, పరిస్థితులలో ఉత్తమమైన వాటిని చూస్తారు. ప్రతిదాన్ని నమ్మదగిన హృదయంతో అంగీకరిస్తారు. ఏదైనా సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు మీరు మీ స్థితిస్థాపకత, సానుకూల దృక్పథంపై ఆధారపడతారు. మొత్తంమీద, మీరు జీవితంలో ఉత్తమమైన వాటి కోసం ఆశిస్తారు.

పిల్లి మెట్లు దిగుతుంటే..

మీరు సూక్ష్మమైన విషయాలకు, వివరాలకు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని అర్థం. మీకు బలమైన అంతర్ దృష్టి నైపుణ్యాలు కూడా ఉన్నాయి. మీరు కూడా సంయమనం కలిగిన వ్యక్తులు. మీరు ఏదైనా అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు లేదా నిర్ణయం తీసుకునే ముందు విషయాలను నేరుగా చూసి వివరాలను పరిశీలించే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సంక్షోభ పరిస్థితిల్లో మాత్రం ప్రశాంతంగా, మౌనంగా ఉంటారు. ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తారు. క్లిష్ట పరిస్థితిల్లో నిరాశ చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.