Flight: విమానాన్ని పేల్చేస్తానంటూ ప్రయాణికుడి బెదిరింపు.. హడలిపోయిన తోటి ప్రయాణికులు.. చివరికి
అతడ్ని చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి బెదిరింపులకు భయపడిపోయరు. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని, తాను వెంట తెచ్చుకున్న లగేజీని తనీఖీ చేశారు. కానీ ఆ లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అయితే పైలట్ మాత్రం ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించాడు. అత్యవసరంగా ప్రయాణికుల్ని కిందకి దించేశారు. మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో విమానాన్ని రన్‌వేకు చివరన ల్యాండిగ్ చేసేశారు.

విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన పనికి అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విమానాన్ని పేల్చేస్తానంటూ ఆ వ్యక్తి అకస్మాత్తుగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక చేసేదేమి లేక విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ ఘటన ఆస్ట్రేలియా నుంచి మలేసియాకు బలయల్దేరిన విమానంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వివారాల్లోకి వెళ్తే మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్122 అనే విమానం సోమవారం రోజున మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి మలేసియా రాజధాని అయిన కౌలాలంపుర్‌కు బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయి కొద్దిసేపటికి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. విమానాన్ని పేల్చేస్తానంటూ గట్టిగా అరవసాగాడు.
ఇక అతడ్ని చూసిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి బెదిరింపులకు భయపడిపోయరు. దీంతో విమానంలో ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని, తాను వెంట తెచ్చుకున్న లగేజీని తనీఖీ చేశారు. కానీ ఆ లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అయితే పైలట్ మాత్రం ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించాడు. అత్యవసరంగా ప్రయాణికుల్ని కిందకి దించేశారు. మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో విమానాన్ని రన్‌వేకు చివరన ల్యాండిగ్ చేసేశారు. ఆ తర్వాత విమానంలో బెదిరింపులకు పాల్పడిన ప్రయాణికుడ్ని ఎయిర్‌పోర్టు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే విమానంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.




ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో దాదపు 199 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరకు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. అసలు ఆ ప్రయాణికుడు అలా ఎందుకు విచిత్రంగా ప్రవర్తించాడు.. ఎందుకు విమానాన్ని పేల్చే్స్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అనే విషయాలపై ఇంకా స్పష్టం లేదు. ఇదిలా ఉండగా ప్రయాణికులను మరో విమానంలో తమ గమ్యస్థానాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మలేసియన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇదిలా ఉండగా ఇటీవల విమానాల్లో కూడా విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ వృద్ధురాలిపై తోటి ప్రయాణికుడు మూత్రవిసర్జన చేయడం దుమారం రేపింది. అలాగే మరికొన్ని సంఘటనల్లో ప్రయాణికులు ఒకరినొకరు కొట్టుకోవడం లాంటి ఘటనలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విమానయాన సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.