Hareem Shah: పాపం టిక్ టాక్ స్టార్.. సర్జరీ కోసం వెళ్తే.. సీన్ కాస్తా రివర్స్ అయింది.! వీడియో..
Pakistani TikTok star Hareem Shah: పాపం.. ఆమె ఒక టిక్‌టాక్ స్టార్.. తన పెదాల ఆకృతిని మార్చుకోవాలనుకొని లండన్ వెళ్లింది. అందమైన పెదాల ఆకృతి కోసం బాగానే
Pakistani TikTok star Hareem Shah: పాపం.. ఆమె ఒక టిక్‌టాక్ స్టార్.. తన పెదాల ఆకృతిని మార్చుకోవాలనుకొని లండన్ వెళ్లింది. అందమైన పెదాల ఆకృతి కోసం బాగానే ఖర్చవుతుంది కావున అన్ని ఏర్పాట్లతో అక్కడికి చేరుకుంది. పెదాల సర్జరీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ.. ఇంతలో పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సగం సర్జరీతో వెనుదిరగాల్సి వచ్చింది. డబ్బు చేతిలో లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో మధ్యలోనే సర్జరీ ప్రక్రియను విరమించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ హరీమ్ షా (Hareem Shah) శనివారం అర్థరాత్రి ఉబ్బిన పెదవితో సోషల్ మీడియాలో కనిపించింది. అప్పటినుంచి ఆమె వార్తల్లో నిలిచింది.
వీడియోలో.. హరీమ్ షా పై పెదవి ఉబ్బిపోయి కనిపించింది. ఆమె లిప్ ఫిల్లర్ ట్రీట్‌మెంట్‌ను మధ్యలోనే వదిలేసిందని తెలుస్తోంది. తాను ప్రస్తుతం యూకేలో ఉన్నానని.. తన పెదవుల సర్జరీ కోసం డాక్టర్ వద్దకు వెళ్లానని చెప్పింది. వెంటనే డాక్టర్ తన పెదవికి ఫిల్లర్ ట్రిట్‌మెంట్ ప్రారంభించారని అప్పుడే.. తనకు కాల్ వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) తన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసిందని తెలిసిందన్నారు. ఈ ప్రక్రియ ఖరీదైనది కావడంతో దానిని మధ్యలోనే వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు హరీమ్ షా వెల్లడించింది.
View this post on Instagram
డాన్ మీడియా కథనం ప్రకారం.. హరీమ్ షా పెద్ద మొత్తం నగదుతో పాకిస్తాన్ నుంచి UKకి ప్రయాణించినట్లు పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వీడియోను అప్‌లోడ్ చేసింది. దీని తర్వాత జనవరి 12న FIA ఆమెపై మనీలాండరింగ్ విచారణ ప్రారంభించింది.
వీడియోలో.. హరీమ్ షా మాట్లాడుతూ.. డబ్బును పాకిస్తాన్ నుండి లండన్‌కు తీసుకువెళ్లడం ఇదే మొదటిసారి అని చెప్పింది. పాకిస్తాన్ రూపాయిలను యూరోలు లేదా డాలర్లుగా మార్చవలసి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారని.. తన సమస్య గురించి చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. పాకిస్థాన్ చట్టాలు పేదలకు మాత్రమే వర్తిస్తాయని హరీమ్ షా వాపోయింది.
Hareem Shah reaches London pic.twitter.com/aehGbDLGJC
— Murtaza Ali Shah (@MurtazaViews) January 12, 2022
పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక ప్రయాణీకుడు పాకిస్తాన్‌కు ఎంతైనా విదేశీ కరెన్సీని తీసుకురావచ్చు. కానీ షరతులు లేకుండా విదేశీ కరెన్సీలను $10,000 వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంటుంది.
Also Read: