Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్!

సముద్రం ఎన్నో రహస్యాలను తనలో దాచి పెట్టుకుంటుంది. మనకు తెలియని, కనిపించని అనేక రకాల వింత జీవులు సముద్రగర్భంలో...

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్!
Vintha Jeevi
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2022 | 10:31 AM

సముద్రం ఎన్నో రహస్యాలను తనలో దాచి పెట్టుకుంటుంది. మనకు తెలియని, కనిపించని అనేక రకాల వింత జీవులు సముద్రగర్భంలో ఎన్ని వేల ఫీట్ల లోతులో ఉంటాయి. అప్పుడప్పుడూ అలాంటి జీవులు కనిపిస్తేనే గానీ వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా ఓ వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసేందుకు కొంచెం భయానకంగా ఉన్నప్పటికీ.. నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. దక్షిణ బ్రెజిల్‌కి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట కోస్ట్‌లో చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్‌తో వేట కొనసాగిస్తున్నాడు. ఇంతలో సముద్రం నుంచి ఒక్కసారిగా ఓ వింత ఆకారం బయటకు వచ్చింది. ఏంటా అని చూడగా.. నల్లగా.. మెరిసే కళ్లతో భయంకరంగా కనిపించింది. ఒక్కసారిగా బోటుపై దాడికి యత్నించింది. అంతే.. ఆ వ్యక్తి స్టీమర్‌‌ను స్టార్ట్ చేసి వేగంగా అక్కడ నుంచి బయటపడ్డాడు. అయితే ఆ వింత జీవి స్టీమర్‌తో పోటీ పడుతూ అతడ్ని వెంటాడింది.

అది నీటిలో పైకి ఎగురుతూ ఎంతో వేగంగా స్టీమర్‌ వైపు దూసుకొచ్చింది. ఆ జీవి అలా ఎగురుతున్నప్పుడు దాని కళ్లు విద్యుత్‌ బల్బుల్లా మెరుస్తూ కనిపించాయి. భయపడుతూనే ఆ వ్యక్తి తనకు ఎదురైనా ఆ ఘటనను తన కెమెరాలో బంధించాడు. కాగా ఈ వీడియోను ఓ ట్విట్టర్‌ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్‌ చేశారు. వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇంతకీ అది ఏ జీవీ అనేది కచ్చితంగా తెలియరాలేదు. కానీ కొందరు మాత్రం అది ‘సీ లయన్‌’ అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.