Optical Illusion: మీకో సవాల్.. ఈ ఫొటోలో గుడ్లగూబను కనిపెడితే.. మీకంటే తోపు లేరిక్కడ..

మనందరం ఫన్‌ కోరుకుంటాం. అయితే ఫన్‌తో పాటు కాస్త బుర్రకు పదునుపెట్టాలంటే.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పట్టాల్సిందే.

Optical Illusion: మీకో  సవాల్.. ఈ ఫొటోలో గుడ్లగూబను కనిపెడితే.. మీకంటే తోపు లేరిక్కడ..
Optical Illusion Find The Hidden Owl In This Image
Follow us
Venkata Chari

|

Updated on: Aug 23, 2022 | 12:20 PM

Optical Illusion: ఈ చిత్రంలో దాచిన గుడ్లగూబను మీరు కనుగొనగలరా? అయితే ఓసారి ట్రై చేయండి మరి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో యూజర్లకు అటు వినోదంతోపాటు, బ్రెయిన్‌కు పదునుపెట్టేలా ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫొటోలు పనిచేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ప్రతిరోజూ కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోలో దాగిన గుడ్లగూబను మీరు ఎంత స్పీడ్‌గా కనుగొంటారో చూద్దాం.

ఆప్టికల్ ఇల్యూషన్స్ విషయానికి వస్తే,కొందరికి ఇవి ఎంతో కాలక్షేపాన్ని అందిస్తుంటాయి. కొంతమందికి ఇది మెదడుకు పదును పెట్టేలా ఉంటాయి. ఇటీవల, ఇంటర్నెట్‌ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలతో నిండిపోయింది. ఇది నెటిజన్లను గందరగోళానికి కూడా గురిచేస్తుంది. చాలా మంది ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం వీటిని కనుగొనడంలో విఫలమవుతున్నారు. మరికొంత మంది మాత్రం చాలా వేగంగా పరిష్కరిస్తున్నారు.

Optical Illusion Find The Hidden Owl In This Image

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోను అర్థం చేసుకోవడానికి మనం మన మనస్సుపై దృష్టి పెట్టాలి. ముందుగా ఈ ఫొటోను గమనిస్తే, మీరు ఓ పందిని చూడొచ్చు. అయితే, అందరూ ఇక్కడే భ్రమపడుతుంటారు.

ఎందుకంటే ఇది సాధారణ ఫొటోలు కాదు. వీటిని ప్రత్యేకంగా ఆఫ్టికల్ ఇల్యూషన్ అంటూ ప్రకటించామంటే.. ఇందులో ఏదో సమ్‌థింగ్ ఉన్నట్లే కదా.. అందుకే తొలుత ఫొటో చూసిన వారంతా పందిని చూస్తున్నారు. కానీ, అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ ఫొటోను తిప్పి చూస్తే, అసలు మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది. ఈ ఫొటోను తిప్పి చూస్తే అది పంది కాదు.. గుడ్లడూబ అని అర్థమవుతుంది.

Optical Illusion Find The Hidden Owl In This Image (1)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..